ఐఐటీలో మరో 14 మందికి Covid పాజిటివ్

Published: Sun, 01 May 2022 08:16:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఐఐటీలో మరో 14 మందికి Covid పాజిటివ్

పెరంబూర్‌(చెన్నై): మద్రాస్‌ ఐఐటీలో మరో 14 మందికి పాజిటివ్‌ నిర్ధారణకావడంతో,కళాశాలలో మొత్తం బాధితుల సంఖ్య 196కు చేరింది. ఈ కళాశాలలో రాష్ట్రంతో పాటు 15 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు హాస్టల్స్‌లో బస చేసి చదువుకుంటున్నారు. హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థికి ఈనెల 19వతేదీ పాజిటివ్‌నిర్ధారణఅయింది. మరికొందరు విద్యార్థులకూపాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో, విద్యార్థులు, ప్రొఫెసర్లు, సిబ్బంది అందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం 11 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, మొత్తం బాధితుల సంఖ్య 171కి చేరింది. ఈ నేపథ్యంలో, శనివారం మరో 14 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బాధితులందరినీ క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.