’మ్యాగీ మిల్క్ షేక్’ను చూసి... ‘ఎక్కడి నుంచి వస్తారయ్యా బాబూ’ అంటున్న నెటిజన్లు!

Sep 15 2021 @ 12:17PM

న్యూఢిల్లీ: మ్యాగీ ప్రియులకు మరో శుభవార్త. సోషల్ మీడియాలో మ్యాగీతో చేసిన మరో వంటకం ట్రెండింగ్ అయ్యింది. అదే... మ్యాగీ మిల్క్ షేక్... ఈ మాట వినగానే చాలామంది షేక్ అయి ఉంటారు. ఈ డిష్‌కు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఒక గ్లాసులో మిల్క్ షేక్‌తో పాటు మ్యాగీ కలిసిపోయివుంది. 

దీనిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వంటలు చేయడంలో అభిరుచి ఉన్న కొందరు మ్యాగీతో రకరాల వంటకాలు చేస్తుంటారు. రెండు నిముషాల్లో తయారయ్యే ఈ వెజ్ ఐటెమ్‌తో లెక్కకుమించిన వెరైటీ వంటకాలను చిటికెలో చేయడం, దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు ట్రెండీగా మారింది. వీటిలో కొన్ని వంటకాలు నవ్వు తెప్పించడంతోపాటు, చెప్పలేని ఫీలింగ్‌ను కలిగిస్తాయి. ఇదే కోవలో ఇప్పుడు మ్యాగీ మిల్క్ షేక్ ట్రెండ్ అయ్యింది. దీనిని చూసిన కొందరు నెటిజన్లు ఈ వంటకం చేసిన వారిని ఉద్దేశించి... ‘ఎక్కడి నుంచి వస్తారయ్యా బాబూ’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...