వైభవంగా జగన్నాథ రథయాత్ర

ABN , First Publish Date - 2022-07-02T06:28:17+05:30 IST

వైభవంగా జగన్నాథ రథయాత్ర

వైభవంగా జగన్నాథ రథయాత్ర
రథంపై ప్రత్యేకంగా ఆశీనులైన దేవతా మూర్తులు

ప్రారంభించిన భారజల కర్మాగారం జీఎం థాలే

గౌతమీనగర్‌ కాలనీలో కోలాహలం

అశ్వాపురం, జూలై 1: ఒరిస్సాలోని పూరి జగన్నాథ రథయాత్రకు అనుసంధానంగా ప్రతీ ఏడాది భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని గౌతమీనగర్‌ కాలనీలో రథయాత్రను నిర్వహించడం ఆనవాయితీ . కొవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా యాత్రను నిలిపివేసిన నిర్వాహాకులు ఈ ఏడాది పునఃప్రారంభించారు. ఒరిస్సా రాష్ర్టానికి చెందిన ఉద్యోగులు అధికారులు ఉత్కల్‌ ఫథాఘర్‌ సంస్థగా ఏర్పడి ఉత్సవాలను జరుపుతున్నారు. ఈ యాత్రను శుక్రవారం సాయంత్రం భారజల కర్మాగారం జీఎం వీకే థాలే ప్రారంభించారు. జగన్నాధ స్వామి, బాలభద్ర స్వామి, సుభ ద్రా దేవిలకు శాస్ర్తోత్కంగా పూజలు నిర్వహించారు. అనంతరం దేవతా మూర్తులను ప్రత్యేక పల్లకీలో ఉంచి మంగళవాయిద్యాల మద్య ఒరిస్సా సంప్రదాయ పద్ధతిలో భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా తోడ్కోని వచ్చి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించారు. ఈ క్రమంలో ఒరిస్సా నుంచి వచ్చిన ప్రత్యేక పూజారులు మంత్రోచ్ఛరణల మధ్య జీఎం ఽథాలే చరపర (రథాన్ని శుభ్రపరచడం) కార్యక్రమాన్ని నిర్వహించి దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి.. రథానికి అమర్చిన తాడును లాగియాత్రను ప్రారంభించారు. రథయాత్ర సంధర్భంగా గౌతమీనగర్‌ కాలనీలో కోలాహాలం నెలకొంది. ఈ వైభవాన్ని చూసేందుకు కాలనీ వాసులు భారీగా తరలివచ్చారు. తొమ్మిది రోజుల పాటు జరిగే నిత్య పూజల అనంతరం ఈ నెల 9న జరిగే బహుదా యాత్రతో ఈ రథయాత్ర ముగియనుంది. 



Updated Date - 2022-07-02T06:28:17+05:30 IST