MP Magunta : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎలాంటి సంబంధమూ లేదు

ABN , First Publish Date - 2022-09-19T17:56:47+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌(Delhi Liquor scam)లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి(MP Magunta Srinivasulu Reddy) హస్తముందంటూ

MP Magunta : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఎలాంటి సంబంధమూ లేదు

ఒంగోలు : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌(Delhi Liquor scam)లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి(MP Magunta Srinivasulu Reddy) హస్తముందంటూ వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ తండ్రి హయాం నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని.. ఢిల్లీ(Delhi)లో 32 జోన్లు ఉంటే తమ బంధువులు రెండు జోన్లలోనే వ్యాపారం చేశారని వెల్లడించారు. 


తాను, తన కుమారుడు ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌(Delhi Liquor business)లో డైరెక్టర్లుగా లేమని మాగుంట స్పష్టం చేశారు. తన ఇల్లు, ఆఫీసులో సోదాలు చేసిన ఈడీ(ED)కి అనుమానాలను నివృత్తి చేశామని మాగుంట పేర్కొన్నారు. తమ దగ్గర నుంచి ఈడీ అధికారులు ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకువెళ్ళ లేదన్నారు. మద్యం వ్యాపారం చేసిన అందరి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు(ED Raids) చేశారన్నారు. ఢిల్లీలో ఉన్న కొంత మంది తన వ్యక్తిత్వంపై కావాలని దాడి చేశారన్నారు. లిక్కర్ స్కామ్‌పై సీబీఐ(CBI), ఈడీ దర్యాప్తు చేస్తున్నాయని పేర్కొన్నారు. 


భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేమని మాగుంట తెలిపారు. ఢిల్లీలో మద్యం వ్యాపారం(Liquor Business) చేసిన వాళ్లందరూ నష్టపోయారని ఆయన వెల్లడించారు. మద్యం స్కాంపై దర్యాప్తు చేస్తున్న ప్రభుత్వ సంస్థల(Government Firms)ను తాము తప్పు పట్టబోతున్నామన్నారు. ఢిల్లీ మద్యం స్కామ్ వ్యవహారంలో తమ కుటుంబానికి నష్టం జరిగిందని మాగుంట తెలిపారు. మాకు ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేవు. మా అబ్బాయి రాఘవరెడ్డి(Magunta Raghava Reddy) 2024 లో ఒంగోలు నుంచి పోటీ చేస్తారని మాగుంట పేర్కొన్నారు.


Updated Date - 2022-09-19T17:56:47+05:30 IST