వైభవంగా మహా చండీయాగం

ABN , First Publish Date - 2021-03-01T06:21:45+05:30 IST

జిల్లాకేంద్రంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో మహాచండీ యా గాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా మహా చండీయాగం
భువనగిరిలో మహాచండీ హోమ పూజలు చేస్తున్న భక్తులు

భువనగిరి టౌన్‌/యాదాద్రి రూరల్‌/భూదాన్‌పోచంపల్లి,  ఫిబ్రవరి 28: జిల్లాకేంద్రంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయంలో మహాచండీ యా గాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. గణపతి ఆదర్వణ శిర్షము తో, చండీ సప్తశతి పారాయణం, అఖండ దీపారాదన, రక్షా బంధనం, రుత్వి గ్వరణము నిర్వహించారు. కార్యక్రమంలో గంగు జగదీశ్వర్‌శర్మ, చెన్న స్వాతి మహేశ్‌, ఆధ్వర్యంలో జరిగిన చండీ యాగంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనే యులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట మండలంలోని కాచారం మధిర గ్రామమైన కైలాసపురంలోని రేణుకాదేవి ఆలయంలో శ్రీరేణుకాదేవి, జమదగ్ని, శివపార్వతుల కల్యాణం వేర్వేరుగా వేదపండితుల మంత్రోచ్చారణ మద్య రంగరంగ వైభవంగ జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ టూరిజం పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్త, అంజయ్యస్వామి ఉన్నారు. భువనగిరి రాయిగిరి రైల్వేస్టేషన్‌ సమీపంలో పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఏ. ఆంజనేయులు, సీహెచ్‌ కిష్టయ్య, కౌన్సిలర్‌ ఎన్‌. అరుణ, మాజీ ఎంపీటీసీ పి. హన్మంతునాయక్‌, బి. చంద్రశేఖర్‌, కె బాలనర్సింహ, దాసరి శ్రీనివాస్‌, ఎల్లేశ్‌, భద్రప్ప, రమేష్‌, మహేశ్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు. భూదాన్‌పోచంపల్లి మహమ్మాయి దేవాలయ ఉత్సవాల్లో శతఘటాభిషేకంలో మహిళా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీ, వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామి, చేపూరి రామ్మోహనచారి, నందిగామ కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-01T06:21:45+05:30 IST