కరెంట్ సంక్షోభాన్ని అధికమించేందుకు బొగ్గును దిగుమతి చేసుకుంటాం: Deputy Chief Minister

ABN , First Publish Date - 2022-04-22T22:03:48+05:30 IST

కరెంట్ సంక్షోభాన్ని అధికమించేందుకు బొగ్గును దిగుమతి చేసుకుంటాం: Deputy Chief Minister

కరెంట్ సంక్షోభాన్ని అధికమించేందుకు బొగ్గును దిగుమతి చేసుకుంటాం: Deputy Chief Minister

పుణె: మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న లోడ్‌ షెడ్డింగ్‌ సంక్షోభాన్ని అధిగమించేందుకు విద్యుత్ ఉత్పత్తి కోసం విదేశాల నుంచి కొంత మేరకు బొగ్గును దిగుమతి చేసుకోవాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ శుక్రవారం అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక బొగ్గు గనిని మహారాష్ట్రలోని విద్యుత్ శాఖకు కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. దేశంలో బొగ్గు సరఫరా జరగాల్సిన రీతిలో జరగడం లేదని పవార్ అన్నారు. ‘‘రాష్ట్రంలో లోడ్ షెడ్డింగ్ జరుగుతోందని, ఈ అంశంపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశం నిర్వహించారని, ప్రతిరోజు విద్యుత్ శాఖపై సమీక్ష చేస్తానని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. లోడ్ షెడ్డింగ్ సమస్యపై వారం రోజుల పాటు దేశంలో విద్యుత్ లభ్యత ఉందో లేదో పరిశీలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో లోడ్ షెడ్డింగ్‌కు స్వస్తి పలికి విద్యుత్ సరఫరా సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్సీపీ సీనియర్ నేత తెలిపారు.

Updated Date - 2022-04-22T22:03:48+05:30 IST