గాజుల అలంకరణలో మహా కామేశ్వరి

Published: Tue, 09 Aug 2022 00:25:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గాజుల అలంకరణలో మహా కామేశ్వరిగాజులతో అలంకరించిన మహా కామేశ్వరి అమ్మవారు

పెందుర్తి, ఆగస్టు 8: పెందుర్తి వెంకటాద్రి శిఖరం ఘాట్‌రోడ్డు దిగువన గల మహా కామేశ్వరి సహిత ద్వాదశ సహిత జ్యోతిర్లింగాలయంలో సోమవార మహాకామేశ్వరి మాతను గాజులతో అలంకరించారు. అమ్మవారి మూలవిరాట్టు విగ్రహం మొత్తం రంగు రంగుల గాజులతో చేసిన అలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ సన్నిధిలో మహిళలు లక్ష కుంకుమార్చన చేశారు. ఆలయ చైర్మన్‌ ధవళ యజ్ఞేశ్వర చైనులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.