మహాశివరాత్రి ఏర్పాట్లు పరిశీలన

ABN , First Publish Date - 2021-03-07T05:30:00+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న 63వ సప్తాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి రోజున అధికసంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.

మహాశివరాత్రి ఏర్పాట్లు పరిశీలన
మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో గోపూజ

సీఎ్‌సపురం : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న 63వ సప్తాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మహాశివరాత్రి రోజున అధికసంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేయవలిసిన వసతులను ఎస్‌ఐ చుక్కా శివబసవరాజు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాట్లు, బందోబస్తు  గురించి, పలు సూచనలు చేశారు. అదేవిధంగా 108 సిబ్బంది దేవస్థానం ప్రాంగణంలో 108 వాహనాలకు సంబంధించిన సదస్సు ఏర్పాటుచేసి దేవస్థాన కార్యనిర్వాహణాధికారి కె.నవీన్‌కుమార్‌కు హెల్ప్‌లైన్‌కు సంబంధించిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డి, ముడిమాల నారాయణరెడ్డి, భైరెడ్డి తిరుపతిరెడ్డి, 108 సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

లింగసముద్రం : మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ నెల 11న లింగసముద్రం, మొగిలిచెర్ల ఆలయాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పామూరు సీఐ వి.శ్రీనివాసరావు, లింగసముద్రం ఎస్సై ఎం.సైదాబాబుతో కలిసి పరిశీలించారు. ఆదివారం ఆయన లింగసముద్రంలోని తిరుమణిశెట్టి కోటయ్య మందిరం, మొగిలిచెర్ల లోని దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద నిర్వాహకులు, భక్తులతో మాట్లాడారు. 

పామూరు : పంచాయతీ పరిధిలోని విరాట్‌నగర్‌ కాలనీలో వెలసిన  పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానంలో ఈ నెల 11న మహాశివ రాత్రి కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులకు అన్నదానం, తీర్థ ప్రసాదాలు అందజేయనున్నాట్లు, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు స్వామి వార్లకు విశేష అర్చనలు నిర్వహిస్తున్నట్లు కమిటీ తెలిపారు. కాగా మండలంలోని పడమట కట్టకిందపల్లి గ్రామంలో వెలసిన  శ్రీ శ్యామలా కామాక్షి సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వార్ల 44వ కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆ దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 

సీఎ్‌సపురం : ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఎం.సత్యనారాయణశర్మ ఆధ్వర్యంలో స్వామివారిని అలంకరించి స్వామివారికి పంచామృతాభిషేకం, హారతులు, గోపూజ వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు మహానైవేథ్యంతో గుడి చుట్టూ ప్రదక్షణలు చేసి స్వామివారికి సమర్పించారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. అలాగే శివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆదివారం వేదపారాయణం, అరుణ మహాసౌర పారాయణం, అరుణ హోమం, లఘుపూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా దేవస్థాన కార్యనిర్వాహణాధికారి కె.నవీన్‌కుమార్‌ పర్యవేక్షించారు.

Updated Date - 2021-03-07T05:30:00+05:30 IST