కులబహిష్కరణతో ఆగిన వృద్ధురాలి అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-01-25T18:48:32+05:30 IST

జిల్లాలోని తొర్రూర్ మండలం చికటాయపాలెం గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. కుల బహిష్కరణతో 24 గంటలుగా ఓ వృద్దురాలి అంత్యక్రియలు నిలిచిపోయాయి.

కులబహిష్కరణతో ఆగిన వృద్ధురాలి అంత్యక్రియలు

మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూర్ మండలం చికటాయపాలెం గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. కుల బహిష్కరణతో 24 గంటలుగా ఓ వృద్దురాలి అంత్యక్రియలు నిలిచిపోయాయి. గ్రామంలో దళిత కాలనీకి చెందిన వేల్పుగొండ వెంకటమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో  మృతి చెందింది. వేల్పుగొండ వెంకటమ్మ కుటుంబ సభ్యులను కులపెద్దలు గత 8 నెలల క్రితం కుల బహిష్కరణ చేశారు. ఎలాంటి ఫంక్షన్ జరిగినా ఆ కుటుంబ సభ్యులని పిలవద్దని కుల పెద్దల హుకుం జారీ చేశారు.


ఈ విషయంపై వేల్పుగొండ వెంకటమ్మ కొడుకు వెంకన్న గతంలో తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కుల పెద్దలు పిలిపించిన ఎస్ఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కులపెద్దలు తమ తీరును మార్చుకోలేదు వేల్పుగొండ వెంకటమ్మ అనారోగ్యంతో మృతి చెంది 24 గంటలు గడిచినప్పటికీ కుల పెద్దలు అంత్యక్రియలు నిర్వహించడానికి నిరాకరించారు. కులపెద్దలు సహకరించకపోవడంతో 24 గంట తర్వాత కుటుంబ సభ్యులే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేపట్టారు.

Updated Date - 2021-01-25T18:48:32+05:30 IST