అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం

ABN , First Publish Date - 2022-03-06T17:32:35+05:30 IST

మహబూబాబాద్ జిల్లా: అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా: అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, కార్లాయిలో పోడు సాగు భూములలో ఫారెస్టు అధికారులు బలవంతంగా ట్రెంచ్ పనులు నిర్వహించడంపై మండిపడ్డారు. కార్లాయి అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల నుంచి  రైతులు పోడు భూములకు పట్టాలు పొంది సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి తమదేనని అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా జేసీబీలతో ట్రెంచ్ పనులు చేపట్టారు.


బాధిత రైతులు ఎమ్మెల్యే సీతక్కకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సీతక్క.. ఓ రైతు బైకుమీద ఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణమే ట్రెంచ్ పనులను అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారులతో పోన్‌లో మాట్లాడుతూనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ముఖ్యమంత్రి పోడు రైతులకు న్యాయం చేస్తామని బాధితుల నుంచి దరకాస్తులు తీసుకుంటుంటే.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దైర్జన్యంగా ట్రెంచ్ కొ్ట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని సీతక్క ప్రశ్నించారు. తక్షణమే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-06T17:32:35+05:30 IST