ఎలకా ఎంత పని చేశావ్‌ !

ABN , First Publish Date - 2021-07-18T17:51:14+05:30 IST

ఆయనో రైతు, కూరగాయాల వ్యాపారమూ చేస్తాడు..

ఎలకా ఎంత పని చేశావ్‌ !

వైద్య ఖర్చులకు దాచుకున్న రూ.2.5 లక్షలు.. ఎలుకల పాలు


మహబూబాబాద్‌ రూరల్‌: ఆయనో రైతు, కూరగాయాల వ్యాపారమూ చేస్తాడు. తన వైద్య ఖర్చులకు, వ్యవసాయ పెట్టుబడి కోసం అప్పు చేసి రూ.2 లక్షలు తెచ్చుకొని ఇంట్లో దాచుకున్నాడు. అన్నీ ఐదువందల   నోట్లే. ఒకానొక రోజు డబ్బు అవసరంపడి బీరువా తెరిస్తే ఆ నోట్లన్నీ ముక్కలు ముక్కలుగా కనిపించడంతో ఆయన షాక్‌ అయ్యాడు. ఇదంతా ఎలుకల పనే. బీరువాలోకి చొరబడి నోట్లను కొరికేశాయి. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం శివారు ఇంద్రనగర్‌ కాలనీకి చెందిన భూక్యా రెడ్యా అనే వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. నగదంతా ఎలుకల స్వైర విహారానికి పనికిరాకుండా పోయింది.  మరో రూ.50 వేల నగదు మాత్రం చెక్కు చెదరలేదు. ఆపరేషన్‌ కోసం అప్పుతెచ్చిన డబ్బులు ఎలుకలు నాశనం చేయడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని రెడ్యా విజ్ఞప్తి చేశాడు. 

Updated Date - 2021-07-18T17:51:14+05:30 IST