Mahabubabad: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు

ABN , First Publish Date - 2022-06-27T16:33:18+05:30 IST

భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌‌లో పొగలు వ్యాపించాయి.

Mahabubabad: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు

మహబూబాబాద్: భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌‌ (Konark Express)లో పొగలు వ్యాపించాయి. దీంతో జిల్లాలోని డోర్నకల్ జంక్షన్‌లో రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. బ్రేక్ పట్టేయడంతో పొగలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. రైలులో లోపాన్ని సిబ్బంది సరిచేసే పనిలో పడ్డారు.

Updated Date - 2022-06-27T16:33:18+05:30 IST