Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..37 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-07-28T14:04:25+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..37 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్ట్‎లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్ట్ 37 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 3,38,900 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,50,218 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 316.870 మీటర్లు ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.508 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-07-28T14:04:25+05:30 IST