Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‎కు పోటెత్తుతున్న వరద..36 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-08-02T15:02:51+05:30 IST

జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు 36 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 3,97,500 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో ...

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‎కు పోటెత్తుతున్న వరద..36 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 36 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 3,97,500 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 3,85,527 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.657 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుతం 6.823 టీఎంసీలుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.290 మీటర్లుగా ఉంది.

Updated Date - 2021-08-02T15:02:51+05:30 IST