Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‎కు తగ్గిన వరద..

ABN , First Publish Date - 2021-08-11T14:01:30+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పడటంతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద తగ్గుముఖం పట్టింది. అధికారులు ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు

Mahabubnagar: జూరాల ప్రాజెక్ట్‎కు తగ్గిన వరద..

మహబూబ్‎నగర్: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పడటంతో జూరాల ప్రాజెక్ట్‌కు వరద తగ్గుముఖం పట్టింది. అధికారులు ప్రాజెక్ట్ 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ఇన్ ఫ్లో 76,500 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 65,240 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 318.240 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.091 టీఎంసీలుగా ఉంది.

Updated Date - 2021-08-11T14:01:30+05:30 IST