మహాలక్ష్మీదేవి.. గంగమ్మ

ABN , First Publish Date - 2022-10-01T06:36:48+05:30 IST

దసరా మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం బోయకొండ గంగమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

మహాలక్ష్మీదేవి.. గంగమ్మ

దసరా మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం బోయకొండ గంగమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రెండు చెతుల్లో రెండు కమలాలు, మరో రెండు చేతులు అభయ, కటి హస్తాలతో  మహాలక్ష్మీదేవిగా స్వర్ణాభరణాలతో అమ్మవారిని అలంకరించారు. అద్దాల మండపం వద్ద ఉత్సవమూర్తిని అలంకరించి, కలశ స్థాపన  హోమం నిర్వహించారు. గణపతి, నవగ్రహ, దుర్గా, చండీ, మృత్యుంజయేశ్వర, మహాలక్ష్మీ హోమాలు చేశారు. ఆలయ చైర్మన్‌ శంకరనారాయణ, ఈవో చంద్రమౌళి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - 2022-10-01T06:36:48+05:30 IST