అమెజాన్‌‌‌ప్రైమ్‌లో డైరెక్ట్‌గా విక్రమ్ చిత్రం

Published: Mon, 24 Jan 2022 15:05:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అమెజాన్‌‌‌ప్రైమ్‌లో డైరెక్ట్‌గా విక్రమ్ చిత్రం

తమిళ హీరో చియాన్ విక్రమ్, తనయుడు ధ్రువ్ విక్రమ్ తొలి సారిగా కలిసి నటించిన చిత్రం ‘మహాన్’. 7 స్ర్కీన్ స్డూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మాణంలో,  కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కింది. బాబీ సింహా ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. సీనియర్ నటి సిమ్రన్ కీలకపాత్ర చేస్తోంది. వాణి భోజన్, సనంత్, దీపక్ పరమేశ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 10న డైరెక్ట్ గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.


తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. కాకపోతే ఒక్క కన్నడ భాషలో మాత్రం ‘మహా పురుష’ టైటిల్ తో విడుదల చేస్తున్నారు. మిగిలిన భాషల్లో అదే పేరుతో అందుబాటులో ఉంటుంది. విక్రమ్ గ్యాంగ్‌స్టర్ గా నటిస్తుండగా.. ధ్రువ్ విక్రమ్ ఆయనకు సహాయకుడిగా కీలక పాత్రలో కనిపిస్తాడట. ఈ రివెంజ్ స్టోరీ విక్రమ్ కు 60వ చిత్రం. 2019లో వచ్చిన ‘కడారం కొండాన్’ విక్రమ్ చివరగా కనిపించిన సినిమా. ‘జెమినీ, భీమ’ సూపర్ హిట్ చిత్రాల తర్వాత విక్రమ్ గ్యాంగ్‌స్టర్ గా నటిస్తున్న సినిమా కావడంతో ‘మహాన్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జగమే తంత్రం’ చిత్రంతో  పరాజయం ఎదుర్కొన్న కార్తిక్ సుబ్బరాజ్ కు ‘మహాన్’ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.  


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest News in Teluguమరిన్ని...