టీడీపీ యూరోప్ టీం ఆధ్వర్యంలో ఘనంగా మహానాడు వేడుకలు.. NTR విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2022-05-29T23:27:49+05:30 IST

ఏ దేశమేగినా ఎందుకాలిడినా మరువరాదు మన తెలుగు జాతి ఖ్యాతిని, జన్మభూమిని అనే ఆశయంతో యూరోప్ ఖండంలోని పలుదేశాల్లో టీడీపీ అభిమానులు మహానాడును జరుపుకున్నారు.

టీడీపీ యూరోప్ టీం ఆధ్వర్యంలో ఘనంగా మహానాడు వేడుకలు.. NTR విగ్రహావిష్కరణ

ఏ దేశమేగినా ఎందుకాలిడినా మరువరాదు మన తెలుగు జాతి ఖ్యాతిని, జన్మభూమిని అనే ఆశయంతో యూరోప్ ఖండంలోని పలుదేశాల్లో టీడీపీ అభిమానులు మహానాడును జరుపుకున్నారు. శనివారం నాడు మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ మహానాడులో భాగంగా డా.కిషోర్ బాబు ఆధ్వర్యంలో అన్న నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. మునుపెన్నడూ లేనివిధంగా వివిధ దేశాల సమన్వయంతో టీడీపీ యూరోప్ టీంఈ వేడుకను ఘనంగా నిర్వహించింది.


ఒకే వేదికపై  టీడీపీ నాయుకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,చింతకాయల అయ్యన్నపాత్రుడు, పంతగాని నర్సింహాప్రసాద్ తదితరుల ప్రసంగించారు. వివేక్ కరియావుల(నెథర్లాండ్స్)అధ్యక్షతన,వివిధ దేశస్థుల నాయకులు అమర్నాధ్(డెన్మార్క్), వేంకటపతి(నార్వే), ప్రముఖ్(ఐర్లాండ్), సుమంత్, దినేష్(మాల్టా), సతీష్(ఇటలీ), సాయి మౌర్య(హన్గేరి), ప్రవీణ్(పోలాండ్), శివకృష్ణ, కొండయ్య(బెల్జియం) ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు.


మొదటి తీర్మానం 

యూరోప్ ఖండంలో తెలుగుదేశం పార్టీ విస్తరణ:  ప్రస్తుతం 16 దేశాల్లో క్రియాశీలకంగా ఉన్న నాయకత్వాన్ని 25 పైగా దేశాలకు విస్తరించడం. తద్వారా తెలుగురాష్ట్రాల్లో పార్టీని బలపరిచి అధికారమే లక్ష్యంగా కార్యక్రమాల నిర్వహణ.

రెండవ తీర్మానం

సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజా చైతన్యం: రాష్ట్ర సమస్యలను తరచూ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా ప్రజలకి తెలియచేయడం.

మూడవ తీర్మానం 

క్షేత్ర స్థాయి ప్రచారం:  రెండు నుండి ఐదు పార్లమెంటు నియోజక వర్గాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం

స్థానిక యువత: తటస్థులని చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ విధి విధానాల వైపు ఆకర్షితులని చేయడం. స్థానిక యువతను నియోజకవర్గంలోని నాయకులతో అనుసంధానం చేసి పార్టీ విధి విధానాలపై కమిటీ ఏర్పాటు చేయడం. 

సంక్షేమం—అభివృద్ధి: యూరోప్‌లోని ప్రతి దేశంలోకి  కొత్తగా వచ్చిన వారికి కావలసిన సహాయ సహకారాలు అందించటం. విపత్తులు, సమస్యలు ఏర్పడినప్పుడు ట్రస్ట్ ద్వారా తెలుగు సమాజానికి తోడ్పాటు.

నాల్గవ తీర్మానం

ఉపాధి కల్పన, వృత్తి నైపుణ్యాలు మెరుగుపరచడం ద్వారా విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ అభివృద్ధి చెందాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు గారి కోరిక.  సామాజిక ఆర్ధిక కార్యక్రమాల్లో తెలుగు వారు పాల్గొనే విధంగా ప్రణాళికలు. తద్వారా సామజిక సేవని రాజకీయ ప్రక్రియలో భాగం చేయడం.



   ఫొటో గ్యాలరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి



Updated Date - 2022-05-29T23:27:49+05:30 IST