త్వరలోనే సెట్స్‌పైకి మహారాజా

Jun 9 2021 @ 00:48AM

బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహారాజా’. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రం షూటింగ్‌ రెండో దశ కరోనాతో నిలిచిపోయింది. తాజాగా సినిమా షూటింగ్స్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ‘మహారాజా’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి  చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ సన్నాహాలు చేస్తోంది. ఆ సంస్థ ప్రస్తుతం పలు చిత్రాలను నిర్మిస్తుండగా ముందుగా ‘మహారాజా’ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. 1862లో జరిగిన యథార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో జునైద్‌ జర్నలిస్ట్‌ కర్సన్‌దాస్‌ ముల్జీ అనే పాత్రలో కనిపించనున్నారు. షాలినిపాండే కథానాయిక.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.