petrol, diesel ధరల్ని తగ్గించిన Maharashtra

ABN , First Publish Date - 2022-05-23T00:37:19+05:30 IST

పెట్రోల్, డీజిల్‌ (petrol, diesel) ధరలను కేంద్ర ప్రభుత్వం (Union govt) తగ్గించిన అనంతరం.. ఒక్కో రాష్ట్రం ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ఈ విషయమై నిర్ణయం తీసుకోగా తాజా మహారాష్ట్ర (Maharashtra) కూడా..

petrol, diesel ధరల్ని తగ్గించిన Maharashtra

ముంబై: పెట్రోల్, డీజిల్‌ (petrol, diesel) ధరలను కేంద్ర ప్రభుత్వం (Union govt) తగ్గించిన అనంతరం.. ఒక్కో రాష్ట్రం ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ఈ విషయమై నిర్ణయం తీసుకోగా తాజా మహారాష్ట్ర (Maharashtra) కూడా ఈ దిశగా అడుగులు వేసింది. చమురుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన విలువ ఆధారిత పన్నును ఆదివారం తగ్గించింది. దీంతో మహారాష్ట్రలో పెట్రోల్‌పై 2.08 రూపాయలు, డీజిల్‌పై 1.44 రూపాయలు తగ్గింది. కాగా, శనివారం ఇధన ధరల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయగానే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే విమర్శలు గుప్పించారు. ఇంధన ధరల్ని ముందుగా పెంచి ఇప్పుడు నామమాత్రంగా తగ్గించడం సరికాదని శనివారం ఆయన అన్నారు.

Updated Date - 2022-05-23T00:37:19+05:30 IST