lumpy skin disease: లంపీ చర్మవ్యాధితో 42 పశువుల మృతి

ABN , First Publish Date - 2022-09-13T13:07:59+05:30 IST

పశువులను వణికిస్తున్న లంపీ స్కిన్ వ్యాధి(lumpy skin disease) మహారాష్ట్రాకు(Maharashtra) సోకింది....

lumpy skin disease: లంపీ చర్మవ్యాధితో 42 పశువుల మృతి

ముంబయి(మహారాష్ట్ర):పశువులను వణికిస్తున్న లంపీ స్కిన్ వ్యాధి(lumpy skin disease) మహారాష్ట్రాకు(Maharashtra) సోకింది. లంపీ చర్మవ్యాధితో మహారాష్ట్రలో 42 ఆవులు, గేదెలు(cattle) మరణించాయని పశుసంవర్థక శాఖ అధికారులు చెప్పారు.లంపీ స్కిన్ వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే(Chief Minister Eknath Shinde) అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధి వల్ల మరణించిన పశువులకు గాను బాధిత రైతులకు నష్టపరిహారం అందించేందుకు వీలుగా జిల్లాకు కోటి రూపాయల చొప్పున సీఎం విడుదల చేశారు.పశువులను రవాణ చేయకుండా నిషేధించారు. జిల్లాపరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో జిల్లాల్లో లంపీ స్కిన్ వ్యాధి నివారణకు కమిటీలు ఏర్పాటుచేయాలని సీఎం షిండే ఆదేశించారు. 


 జలగామ్ జిల్లా చినావల్ గ్రామంలో మొట్టమొదటి లంపీ స్కిన్ వ్యాధి వెలుగుచూసింది.మహారాష్ట్రలోని 280 గ్రామాల్లో లంపీ స్కిన్ వ్యాధి సోకిందని అధికారులు నోటిఫై చేశారు. జలగాం, అహ్మద్ నగర్, అకోలా, థూలే, పూణే, లాతూర్, ఔరంగాబాద్, కొత్తాపూర్, సాంగ్లీ, యావత్ మాల్, పర్బనీ, షోలాపూర్, వాషిం, నాసిక్, జాల్నా ప్రాంతాల్లో లంపీ స్కిన్ వ్యాధి ప్రబలింది.లంపీ స్కిన్ వ్యాధి నివారణకు మహారాష్ట్ర పశుసంవర్థకశాఖలో ఖాళీగా ఉన్న 1159 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. 


Updated Date - 2022-09-13T13:07:59+05:30 IST