Viral photo: ఎద్దులపై భారం పడకుండా.. విద్యార్థుల వినూత్న ఐడియా.. అద్భుత ఆవిష్కరణ అంటూ నెటిజన్ల ప్రశంసలు..

ABN , First Publish Date - 2022-07-15T02:35:07+05:30 IST

ఎద్దులు లేని వ్యవసాయాన్ని ఊహించలేం. నేటి ఆధునిక యుగంలో కూడా రైతులు వ్యవసాయ పనులకు ఎద్దులను ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. పొలాలను దున్నడం మొదలుకుని..

Viral photo: ఎద్దులపై భారం పడకుండా.. విద్యార్థుల వినూత్న ఐడియా.. అద్భుత ఆవిష్కరణ అంటూ నెటిజన్ల ప్రశంసలు..

ఎద్దులు లేని వ్యవసాయాన్ని ఊహించలేం. నేటి ఆధునిక యుగంలో కూడా రైతులు వ్యవసాయ పనులకు ఎద్దులను ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం. పొలాలను దున్నడం మొదలుకుని.. పంట చేతికొచ్చాక ఇంటికి చేర్చే వరకూ ఎద్దులదే కీలక పాత్ర. ఇంతగా కష్టపడుతున్న ఎద్దులకు మన వంతు ఏమైనా సాయం చేయగలమా!. ఇదే ఆలోచన ఆ విద్యార్థులకు కూడా వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా.. ఆచరణలోకి తీసుకొచ్చారు. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విద్యార్థుల వినూత్న ఆవిష్కరణకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


మహారాష్ట్రలో వందల సంఖ్యలో చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల పరిధిలో చెరుకును పండించడం దగ్గర నుంచి.. కర్మాగారానికి తరలించడం వరకూ ఎద్దుల బండ్లనే వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు అధిక లోడు వేసుకుని వెళ్తుంటారు. దీంతో కొన్ని సార్లు ఎద్దులు వివిధ సమస్యలను ఎదుర్కొంటుంటాయి. దీంతో ఎద్దులకు భారం తగ్గించేందుకు ఏదైనా చేయాలని.. సాంగ్లీ జిల్లాలోని రాజారాంబాపు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఆర్‌ఐటీ)కి చెందిన విద్యార్థుల బృందం ఆలోచించింది. చివరకు ఎద్దుల బండికి ముందు వైపు కాడి కింద అమర్చేలా పోర్టబుల్ టైర్‌ను రూపొందించారు.

ఒకప్పుడు పొలాల్లో పశువుల కాపరి.. ప్రస్తుతం ఈ మహిళ ఏ రేంజ్‌లో ఉందో అస్సలు ఊహించలేరు.. ఒక్కో ఏడాదికి..


అంతేకాకుండా దీనికి పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసేందుకు శివాజీ యూనివర్సిటీ నుంచి రూ.10,000లు కూడా అందుకున్నారు. ఆర్‌ఐటీ కళాశాలలో ఆటో మొబైల్ ఇంజినీరింగ్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న సౌరభ్ భోసలే, ఆకాష్ కదమ్, నిఖిల్ తిపాయిలే, ఆకాష్ గైక్వాడ్, ఓంకార్ మిరాజ్‌కర్‌.. ఈ ఆవిష్కరణకు పూనుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ పరికరాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోను IAS అధికారి అవనీష్ శరణ్.. తన ట్విట్టర్ ఖతా ద్వారా షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. విద్యార్థుల ఆవిష్కరణ అదుర్స్.. అంటూ అభినందిస్తున్నారు.

Viral Video: ఒక్కసారిగా వరద రావడంతో.. నదిలో ఏనుగుతో సహా మునిగిన మావటి.. చివరికి ఏమైందో మీరే చూడండి..





Updated Date - 2022-07-15T02:35:07+05:30 IST