Maharashtra cabinet expansion: ఆగస్టు 15లోగా మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ...దేవేంద్ర ఫడణవీస్‌కు హోంశాఖ?

ABN , First Publish Date - 2022-08-08T18:06:52+05:30 IST

మహారాష్ట్రలో ఆగస్టు 15వతేదీ (August fifteenth)లోగా మంత్రివర్గాన్ని విస్తరించాలని(Maharashtra cabinet expansion)...

Maharashtra cabinet expansion: ఆగస్టు 15లోగా మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ...దేవేంద్ర ఫడణవీస్‌కు హోంశాఖ?

ముంబయి(మహారాష్ట్ర): మహారాష్ట్రలో ఆగస్టు 15వతేదీ (August fifteenth)లోగా మంత్రివర్గాన్ని విస్తరించాలని(Maharashtra cabinet expansion) కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Chief Minister Eknath Shinde) నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis) కు కీలకమైన హోంశాఖ బాధ్యతలు(Devendra Fadnavis to get Home) అప్పగించాలని సీఎం షిండే నిర్ణయించినట్లు సమాచారం. ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో (OBC reservation issue)సుప్రీంకోర్టు తీర్పు పెండింగులో ఉన్న నేపథ్యంలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల(civic polls) నిర్వహణలో జాప్యం జరుగుతోంది. 


ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా షిండే, ఉప ముఖ్యమంత్రిగా ఫడణవీస్ లు జూన్ 30వతేదీన ప్రమాణస్వీకారం చేశారు.కేవలం ఇద్దరు సభ్యుల కేబినెట్ పై ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మంత్రివర్గాన్ని విస్తరించాలని(expansion of the Maharashtra cabinet) సీఎం షిండే యోచిస్తున్నారు.మంత్రివర్గ విస్తరణ ఊహించని విధంగా త్వరగానే జరగనుందని డిప్యూటీ సీఎం ఫడణవీస్ చెప్పారు. 


మంత్రివర్గ ఏర్పాటుపై కసరత్తు సాగుతోందని సీఎం షిండే సైతం ఇటీవల చెప్పారు.మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకున్నా, తాను, ఉప ముఖ్యమంత్రి కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నామని షింటే చెప్పారు.2024 లోక్ సభ ఎన్నికల్లో షిండే నేతృత్వంలోని శివసేన, తమ బీజేపీ కలిసి పోటీ చేస్తాయని డిప్యూటీ సీఎం ఫడణవీస్ చెప్పారు. కేంద్ర మంత్రులు, బీజేపీ కేంద్ర నేతలు లోక్ షభ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు చూస్తారని ఆయన పేర్కొన్నారు.


Updated Date - 2022-08-08T18:06:52+05:30 IST