రాష్ట్రపతి ఎన్నికల తర్వాత Maharashtra మంత్రివర్గ విస్తరణ...సీఎం షిండే వెల్లడి

ABN , First Publish Date - 2022-07-12T13:32:46+05:30 IST

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై 18 రాష్ట్రపతి ఎన్నికల తర్వాత జరగవచ్చని శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు శిబిరం...

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత Maharashtra మంత్రివర్గ విస్తరణ...సీఎం షిండే వెల్లడి

ముంబయి(మహారాష్ట్ర): ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జులై 18 రాష్ట్రపతి ఎన్నికల తర్వాత జరగవచ్చని శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు శిబిరం తాజాగా వెల్లడించింది.శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే వర్గం అధికార ప్రతినిధి దీపక్ కేసర్కర్ ఈ విషయాన్ని చెప్పారు.మంత్రివర్గ విస్తరణలో ఎలాంటి ఇబ్బందులు లేవని,మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సేన వర్గానికి, తిరుగుబాటు శిబిరానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటం వల్లే మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతోందా అనే ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.ప్రస్తుతం శివసేన తిరుగుబాటు శిబిరానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి షిండే, ఆయన డిప్యూటీ సీఎం బీజేపీకి చెందిన దేవేంద్ర ఫఢణవీస్ లు ఇద్దరూ జూన్ 30వతేదీన ప్రమాణ స్వీకారం చేశారు.


 తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి న్యూఢిల్లీలో జులై 13న ఒక ముఖ్యమైన సమావేశం ఉందని, రెబల్ గ్రూపు నుంచి ఒక ప్రతినిధి హాజరవుతారని కేసర్కర్ చెప్పారు.జులై 14వతేదీన బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మద్దతు కోరేందుకు ముంబైలో పర్యటించనున్నారు.రాష్ట్రపతి ఎన్నికలకు సన్నాహాలు జులై 16 మరియు 17 తేదీల్లో జరుగుతాయి.జులై 18న ఓటింగ్ జరగనుంది. గత వారం షిండే, ఫడణవీస్ లు న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు.ఈ పర్యటనలో  బీజేపీ అగ్రనాయకులతో వీరిద్దరు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిపినట్లు భావిస్తున్నారు.


Updated Date - 2022-07-12T13:32:46+05:30 IST