Maharashtra Crisis: ఏక్‌నాథ్ షిండే క్యాంప్ కీలక నిర్ణయం.. గౌహతిలో ఎప్పటివరకంటే..

ABN , First Publish Date - 2022-06-28T04:52:26+05:30 IST

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అనర్హత నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును..

Maharashtra Crisis: ఏక్‌నాథ్ షిండే క్యాంప్ కీలక నిర్ణయం.. గౌహతిలో ఎప్పటివరకంటే..

ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అనర్హత నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 11 వరకూ పొడిగించడంతో రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్టయింది. ఈ పరిణామంతో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న ఏక్‌నాథ్ షిండే క్యాంపులోని ఎమ్మెల్యేలు జోరు పెంచారు. జులై 5 వరకూ గౌహతిలోని హోటల్‌లోనే ఉండి రాజకీయం చేయాలని రెబల్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఆదిత్య ఠాక్రే తాజాగా వెల్లడించడం కొసమెరుపు. తమని ముంబైకి తీసుకురావాలని వాళ్లంతా తమతో మొరపెట్టుకున్నారని ఆయన చెప్పడం గమనార్హం.

Updated Date - 2022-06-28T04:52:26+05:30 IST