Maharashtra ప్రభుత్వ తాజా ఉత్తర్వులపై గవర్నర్ ఆరా

ABN , First Publish Date - 2022-06-28T16:49:09+05:30 IST

మహారాష్ట్రలో శివసేన పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆరా...

Maharashtra ప్రభుత్వ తాజా ఉత్తర్వులపై గవర్నర్ ఆరా

ముంబయి: మహారాష్ట్రలో శివసేన పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఆరా తీస్తున్నారు.జూన్ 22-24వతేదీల మధ్య క్లియర్ అయిన ఫైళ్లు, ప్రతిపాదనల వివరాలను ఇవ్వాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో మంత్రాలయంలో హడావుడిగా పలు ఫైళ్లను క్లియర్ చేసి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ కోష్యారి ఈ ఆదేశాలు జారి చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు, జీఓల వివాలను పంపించాలని మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ ను గవర్నర్‌ కోష్యారి కోరారు.


 ఈ మేర  గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సోమవారం లేఖ అందుకున్న ప్రధాన కార్యదర్శి, అదనపు ప్రధాన కార్యదర్శి డేటాను క్రోడీకరించాలని కోరారు.శాసనమండలిలో ప్రతిపక్ష నేత ప్రవీణ్ దారేకర్ గతంలో కోష్యారీకి రాసిన లేఖలో ప్రభుత్వ జీఓలపై ఫిర్యాదు చేశారు.‘‘గత 48 గంటల్లో 160 ప్రభుత్వ ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది, ఈ ఉత్తర్వులు అనుమానాస్పదంగా ఉన్నాయి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను’’ అని ప్రవీణ్ దారేకర్ గవర్నరుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  

Updated Date - 2022-06-28T16:49:09+05:30 IST