దేశంలో Covid-19 fourth wave వచ్చే అవకాశం లేదు...

ABN , First Publish Date - 2022-05-23T18:22:43+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో కొవిడ్-19 నాలుగో వేవ్ వచ్చే అవకాశం లేదని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే సోమవారం చెప్పారు....

దేశంలో Covid-19 fourth wave వచ్చే అవకాశం లేదు...

మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే వెల్లడి

నాగ్‌పూర్ (మహారాష్ట్ర): ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలో కొవిడ్-19 నాలుగో వేవ్ వచ్చే అవకాశం లేదని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే సోమవారం చెప్పారు.మహారాష్ట్రాలో ప్రతిరోజూ దాదాపు 200 నుంచి 250 కరోనా కేసులు నమోదవుతున్నాయని, ఈ సంఖ్య పెద్దగా పెరగడం లేదని తోపే నాగపూర్ నగరంలో విలేకరులతో పేర్కొన్నారు.‘‘కొవిడ్-19 రికవరీ రేటు చాలా బాగుంది, మహారాష్ట్రాలో కొవిడ్ టీకా మంచి ఫలితాలను చూపిస్తోంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితిలో కరోనా నాల్గవ వేవ్ వచ్చే అవకాశం లేదని నేను భావిస్తున్నాను’’ అని మంత్రి చెప్పారు.ఆదివారం మహారాష్ట్రలో 326 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని మంత్రి చెప్పారు. ‘‘రాష్ట్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఆదివారం 251 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు.


 రాష్ట్రంలో 1,903 క్రియాశీల COVID-19 కేసులు ఉన్నాయి.ప్రతి ఒక్కరికీ COVID-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకోవడంపై ఎలాంటి బలవంతం చేయడం లేదు’’అని మంత్రి చెప్పారు. అయితే ఆరోగ్యశాఖ ఫ్రంట్‌లైన్ కార్మికులు, సేవా ఉద్యోగులు, సీనియర్ సిటిజన్‌లకు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బూస్టర్ షాట్‌లు ఇస్తున్నట్లు తోపే చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి మార్గదర్శకాలు లేనందున తాము ప్రతి ఒక్కరికీ బూస్టర్ మోతాదును తప్పనిసరి చేయలేదని ఆయన చెప్పారు.


Updated Date - 2022-05-23T18:22:43+05:30 IST