ప్రధాని మోదీ విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి మండిపాటు

ABN , First Publish Date - 2022-04-29T02:31:35+05:30 IST

ప్రధాని మోదీ విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి మండిపాటు

ప్రధాని మోదీ విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి మండిపాటు

ముంబై: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారని, అయితే దిగుమతి చేసుకున్న చమురుపై మొదట కేంద్రం, ఆపై రాష్ట్రాలు పన్ను విధిస్తాయని, కాబట్టి కేంద్రం కూడా పన్ను తగ్గించాలని అజిత్ పవార్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పన్నును పెంచలేదని పవార్ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం సీఎన్‌జీపై పన్నును తగ్గించిందని, దీని వల్ల రాష్ట్రం రూ. 1000 కోట్లు నష్టపోయిందని ఆయన తెలిపారు. ముందుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ ఎంత వస్తుందో చూడాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దిగుమతి చేసుకునే చమురుపై మొదట కేంద్రం, ఆ తర్వాత రాష్ట్రాలు పన్ను విధిస్తాయని దేశంలోని ప్రతి ఒక్కరూ అంగీకరించాలని, కాబట్టి కేంద్రం కూడా పన్ను తగ్గించాలని పవార్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-29T02:31:35+05:30 IST