మహారాష్ట్రలో 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు Covid

ABN , First Publish Date - 2022-01-01T17:05:57+05:30 IST

మహారాష్ట్రలో ఇప్పటివరకు 10 మందికి పైగా మంత్రులు,20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలిందని, రాష్ట్రంలో కొవిడ్ -19 కేసులు పెరుగుతూ ఉంటే కఠినమైన ఆంక్షలు అమలు చేస్తామని...

మహారాష్ట్రలో 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు Covid

పూణె: మహారాష్ట్రలో ఇప్పటివరకు 10 మందికి పైగా మంత్రులు,20 మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని తేలిందని, రాష్ట్రంలో కొవిడ్ -19 కేసులు పెరుగుతూ ఉంటే కఠినమైన ఆంక్షలు అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు.మహారాష్ట్రలో తాజాగా 8,067 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైన ఒక రోజు తర్వాత అజిత్ పవార్ హెచ్చరిక జారీ చేశారు.మహారాష్ట్రలో గురువారం కంటే 50 శాతం ఎక్కువ కేసులు నమోదైనాయి.‘‘మేం ఇటీవల అసెంబ్లీ సమావేశాల తేదీలను తగ్గించాం. ఇప్పటివరకు, 10 మందికి పైగా మంత్రులు,  20 మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. కొన్ని రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూను ప్రకటించాయి, మహారాష్ట్రలో, ముంబై, పూణేలలో కేసులు పెరుగుతున్నాయి’’ అని అజిత్ పవార్ పెర్నే గ్రామంలోని జయస్తంభ్ సైనిక స్మారకాన్ని సందర్శించిన తర్వాత విలేకరులతో చెప్పారు.


రోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే కఠినమైన ఆంక్షలు  విధిస్తామని, కరోనాను నివారించడానికి ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలి’’అని మంత్రి కోరారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎద్దుల బండ్ల పందాలకు అనుమతి నిరాకరించింది.మరోమారు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు బహిరంగ సభలు జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  జిల్లా కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2022-01-01T17:05:57+05:30 IST