కంటైన్మెంటు జోన్‌గా మహారాష్ట్ర Old Age Home

ABN , First Publish Date - 2021-11-29T17:00:47+05:30 IST

కొవిడ్ రెండు డోసుల టీకాలు వేయించుకున్న 67 మంది వృద్ధులకు కరోనా సోకిన ఘటన మహారాష్ట్రలో తాజాగా వెలుగుచూసింది....

కంటైన్మెంటు జోన్‌గా మహారాష్ట్ర Old Age Home

67 మంది వృద్ధులకు కరోనా పాజిటివ్  

థానే (మహారాష్ట్ర): కొవిడ్ రెండు డోసుల టీకాలు వేయించుకున్న 67 మంది వృద్ధులకు కరోనా సోకిన ఘటన మహారాష్ట్రలో తాజాగా వెలుగుచూసింది. థానే నగరంలోని ఓ వృద్ధాశ్రమంలో 67 మంది వృద్ధులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంటు జోన్ గా ప్రకటించారు. థానే జిల్లాలోని రూరల్ భీవాండీ పరిధిలోని సోర్గాం గ్రామంలోని మాతృశ్రీ వృద్ధాశ్రమంలో 109 మందికి కరోనా సోకవడంతో ప్రభుత్వ వైద్యుల బృందం వచ్చింది. కరోనా సోకిన వృద్ధులందరినీ థానే జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించారు.కరోనా సోకిన వృద్ధుల్లో 15 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని థానే సివిల్ సర్జన్ డాక్టర్ కైలాష్ పవార్ చెప్పారు. వృద్ధాశ్రమంలో ఉన్న 62మంది వృద్ధులతోపాటు మరో ఐగుగురు సిబ్బందికి కరోనా సోకింది. కరోనా సోకిన 41 మంది వృద్ధులు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. దక్షిణాఫ్రికా దేశం నుంచి ముంబై నగరానికి వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్ చేస్తామని మేయరు చెప్పారు. 


Updated Date - 2021-11-29T17:00:47+05:30 IST