Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ఊహించని ట్విస్ట్.. ఉద్ధవ్‌తో..

ABN , First Publish Date - 2022-06-26T19:16:57+05:30 IST

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం..

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో ఊహించని ట్విస్ట్.. ఉద్ధవ్‌తో..

ముంబై: మహారాష్ట్రలో (Maharashtra Political Crisis) నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు (Shivsena Rebel MLAS) కేంద్ర ప్రభుత్వం Y+ కేటగిరీ భద్రత కల్పించింది. సదరు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పించింది. మహారాష్ట్రలో (Maharashtra) శివ సేన కార్యకర్తలు రోడ్డెక్కి రెబల్ ఎమ్మెల్యేల (Rebel MLAs) తీరుపై నిరసన తెలిపారు. ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గంలోని రెబల్ ఎమ్మెల్యేలు ముంబై (Mumbai) వస్తే శివ సైనికుల సత్తా ఏంటో చూపిస్తామని శివసేన కార్యకర్తలు హెచ్చరించారు. కొన్ని చోట్ల రెబల్ ఎమ్మెల్యేల ఆఫీసులపై శివసేన కార్యకర్తలు దాడులకు కూడా దిగారు. దీంతో.. శివసేన రెబల్ ఎమ్మెల్యేల్లో 15 మందికి కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించింది. రెబల్ ఎమ్మెల్యేలను మంత్రి పదవులు తొలగించాలని ఉద్ధవ్ (Uddhav Thackeray) గవర్నర్‌కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అంతేకాదు.. మరో ట్విస్ట్ ఏంటంటే.. ఏక్‌నాథ్ షిండే క్యాంప్‌లోని 20 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు (Shivsena Rebel MLAs) మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో టచ్‌లో ఉన్నట్లు కూడా జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీంతో.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఎపిసోడ్ ఏ క్షణం ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.



శాసనసభా పక్ష నేతగా అజోయ్ చౌదరిని డిప్యూటీ స్పీకర్ అపాయింట్ చేయడాన్ని సవాల్ చేస్తూ షిండే క్యాంప్ సుప్రీం కోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ వర్గం డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ అనర్హత అభ్యర్థనపై జూన్ 27లోగా సమాధానం ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. అయితే.. అనర్హత పిటిషన్‌పై స్పందించేందుకు తమకు వారం గడువు కావాలని కోరాలని షిండే క్యాంప్ నిర్ణయించింది. మహారాష్ట్రలో ఇంత సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ నేత శరద్ పవార్ ఢిల్లీకి వెళ్లడం కొసమెరుపు.

Updated Date - 2022-06-26T19:16:57+05:30 IST