మహారాష్ట్ర టూ మంచిర్యాల

ABN , First Publish Date - 2021-04-24T04:27:24+05:30 IST

ఒక్క బెడ్డు దొరికితేచాలు...బతుకు జీవుడా అంటూ అందు బాటులో ఉన్న ఆసుపత్రుల్లో చేరిపోతున్నారు కరోనా రోగులు.

మహారాష్ట్ర టూ మంచిర్యాల
మహారాష్ట్ర అంబులెన్స్‌

-కొవిడ్‌ చికిత్స కోసం ఎల్లలు దాటుతున్న రోగులు

-నిత్యం పదుల సంఖ్యలో పేషెంట్ల రాక

-బెడ్లు దొరక్క స్థానికుల అవస్థలు

మంచిర్యాల, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఒక్క బెడ్డు దొరికితేచాలు...బతుకు జీవుడా అంటూ అందు బాటులో ఉన్న ఆసుపత్రుల్లో చేరిపోతున్నారు కరోనా రోగులు. తమను ఆసుపత్రిలో చేర్చుకుంటే చాలు అ నుకుంటున్న కొవిడ్‌ పేషెంట్లు....అందులో కనీస సౌక ర్యాలు ఉన్నాయా....లేదా అన్న విషయం కూడా పరి గణలోకి తీసుకోవడం లేదు. జిల్లా కేంద్రంలో కేవలం కొవిడ్‌కు చికిత్స అందించేందుకు ఇటీవలి కాలంలో పదుల సంఖ్యలో కొత్త ఆసుపత్రులు ఏర్పాటు కావ డం గమనార్హం. ఇండ్లను కిరాయకు తీసుకొని మరీ వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న ఆసుపత్రుల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కొవిడ్‌ చికి త్స అందిస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సై తం విరివిరిగా ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చేస్తు న్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ప్రస్తుతం సాధారణ రోగాలకు చికిత్స అందించే ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేవంటే అతిశయోక్తికాదు.

మహారాష్ట్ర నుంచి రోగుల రాక...

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆసుప త్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో మహా రాష్ట్రకు చెందిన వారే అధికంగా ఉండటం గమనా ర్హం. అక్కడి అంబులెన్సుల్లో నిత్యం పదుల సంఖ్యలో కొవిడ్‌ పేషెంట్లు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కొవిడ్‌ కేసులు విజృంభిస్తు న్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రైవేటు ఆసు పత్రులు కరోనా రోగులతో నిండిపోతుండగా దూరభా రమైనా మంచిర్యాలకు తరలివస్తున్నారు. ముఖ్యంగా సిరొంచా లాంటి మారు మూల ప్రాంతాల్లో వైద్య సౌ కర్యం తక్కువగా ఉండటంతో మంచిర్యాల బాటప డుతున్నారు. అక్కడి రోగులకు తమ జిల్లా కేంద్రమై న గడ్చిరోలికి వెళ్లాలంటే దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అదే మంచిర్యాల జిల్లా కేంద్రానికి రావాలంటే కేవలం 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే సరి పోతుంది. అధిక సంఖ్యలో రోగులు మంచిర్యాలకు వ స్తున్నారు. దీంతో ఇక్కడి ఆసుపత్రుల్లో బెడ్లు నిండి పోయి, స్థానికులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితు లు ఏర్పడ్డాయి. వారం రోజుల క్రితం జిల్లా కేంద్రా ని కి చెందిన ఓ సివిల్‌ కాంట్రాక్టర్‌ కొవిడ్‌తో మృతి చెం దారు. నాలుగు రోజులుగా ఆయన కరోనాతో బా ధప డుతుండగా కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ బెడ్లు ఖాళీగా లేక వెనుదిరగా ల్సి వచ్చింది. అదేరోజు అతను హైద్రాబాద్‌కు తరలి స్తుండగా మార్గమద్యలో మరణించాడు.  

తడిసిమోపెడవుతున్న బిల్లులు 

జిల్లా కేంద్రంలోని సింహభాగం ప్రైవేటు ఆసుప త్రుల్లో రోగులకు బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. ఒక్కసారి కొవిడ్‌ రోగి ఆసుపత్రిలో చేరితే కనీసం ఐదారు రోజులైనా ఆసుపత్రుల్లో ఉండాల్సి వస్తోంది. ఇలా ఒక్కో రోజుకు కనీసం రూ. 30వేలు చార్జీ చేస్తు న్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ. లక్ష న్నర నుంచి రెండు లక్షల వరకు చెల్లించాల్సిన పరిస్థితి. స్థానిక పే షెంట్లయితే బిల్లులను తగ్గించాల్సి వస్తుందనే ఉద్దే శ్యంతో కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో మహారాష్ట్ర వా సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోం ది. కొన్ని సందర్భాల్లో స్థానికులకు బెడ్లు దొరక్కపోగా మహారాష్ట్ర రోగులను మాత్రం వెంటనే చేర్చుకుంటు న్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్థానికులు ఇ బ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

ప్రభుత్వాసుపత్రిలో బెడ్లు ఖాళీ...

కొవిడ్‌ రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ పరంగా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని అధికారులు వినియోగిస్తున్నారు. ప్రస్తు తం ఆ ఆసుపత్రిలో 100 పడకలు అందుబాటులో ఉండగా మరో 20 పడకలతో కూడిన ఐసీయూ ఏ ర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో ఆక్సీజన్‌, వెంటిలేట ర్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉండి, రోగులకు అనువైనదిగా ఉంది. కార్పొరేట్‌ స్థాయిలో ఇక్కడ వై ద్య చికిత్స కూడా అందుతోంది. కరోనా మొదటి దశ లో రోగులు ఈ ఆసుపత్రిపై ఆధారపడే చికిత్స పొం దారు. అధిక సంఖ్యలో ప్రజలు బెల్లంపల్లిలోనే చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌లో మా త్రం ఈ ఆసుపత్రి నిరాధరణకు గురవుతోంది. ప్రస్తు తం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందేవారు లేక అందులోని బెడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. 120 బెడ్లకుగాను శుక్రవారం నాటికి 54 మంది రోగు లు అక్కడ చికిత్స పొందుతుండటం గమనార్హం. పై గా ఇక్కడి ఆసుపత్రిలో అర్హతగల వైద్యులు, ఇతర సి బ్బంది రోగులకు చికిత్స అందిస్తుండగా, ఆహార పదా ర్థాలను కూడా ఉచితంగా అందజేస్తున్నారు. అదే ప్రై వేటు ఆసుపత్రుల్లో చికిత్స ఎవరు ఇస్తున్నారు.. వారి కి అర్హత ఉందా... అనే విషయాన్ని కూడా రోగులు పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. జిల్లా కేం ధ్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడు రోజుల క్రి తం ఆక్సీజన్‌ అందుబాటులో లేక ఓ రోగి మృత్యు వా త పడ్డాడు. అదే బెల్లంపల్లి ఆసుపత్రిలో ఆక్సీజన్‌ ని ల్వలకు ఇబ్బందులు లేవని అక్కడి వైద్యులు పే ర్కొంటున్నారు. 


Updated Date - 2021-04-24T04:27:24+05:30 IST