ముంబై: కోవిడ్ సమయంలో విధించిన లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని మహారాష్ట్ర హోం శాఖ నిర్ణయించింది. లాక్డౌన్ కాలంలో విద్యార్థులు, పౌరులపై ఐపీసీ 188 కింద నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని రాష్ట్ర హోం శాఖ మంత్రి దిలీప్ డబ్ల్యూ పాటిల్ మంగళవారంనాడు తెలిపారు. ఈ నిర్ణయానికి మంత్రివర్గ ఆమోదం లభించగానే కేసుల ఉపసంహరణ మొదలవుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి
కోవిడ్‌ను ఒక మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించిన తర్వాత 2020 మార్చిలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘిచిన వారిపై కేసులు పెట్టాయి. అయితే, పరిస్థితి ఇటీవల గణనీయంగా మెరుగుపడటంతో మార్చి 31 నుంచి కోవిడ్ ఆంక్షలన్నీ తొలగిపోతాయని గత వారంలో హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, గతంలో మాదిరిగానే మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మాత్రం కొనసాగుతాయని తెలిపింది.