ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

ABN , First Publish Date - 2022-07-01T06:45:11+05:30 IST

‘మన ఊరు-మనబడి’తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు

ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
భూమిపూజ చేస్తున్న వినోద్‌కుమార్‌

వీర్నపల్లి, జూన్‌ 30:‘మన ఊరు-మనబడి’తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో ప్రతి మ ఫౌండేషన్‌ సహకారంతో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, అంగన్‌వాడీ నూతన భవనాల నిర్మాణ పనులకు ప్రతి మ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ హరిణితో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం గర్జనపల్లిలో రూ.40 లక్షలతో గోదాం నిర్మాణానికి, మద్దిమల్లలో రూ.4.60 లక్షలతో ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  దత్తత గ్రామంపై మమకారంతో ఆధునిక పాఠశాలను నిర్మించాలని ప్రతిమ ఫౌండేషన్‌ ముందుకు రావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.  ప్రతిమ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ హరిణి మాట్లాడుతూ ప్రతిమ ఫౌండే షన్‌ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహి స్తోందన్నారు.  అనంతరం ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన ఆదర్శ పాఠశాల విద్యార్థులను వినోద్‌కుమార్‌ అభినందించారు.  మండల కేంద్రానికి చెందిన లబ్ధిదారు  కల్యాణలక్ష్మి చెక్కు అందజేశారు.  నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ,  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, డీఈవో రాధాకిషన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొండ రమేష్‌గౌడ్‌, ఎంపీపీ మాలోతు భూల, జడ్పీ టీసీ కళావతి, సర్పంచ్‌ దినకర్‌, ఎంపీటీసీ అరుణ్‌కుమార్‌, సెస్‌డైరెక్టర్‌ మల్లేశం, ఎస్‌ఎంసీ చైర్మన్లు సంతోష్‌నాయక్‌, నరేష్‌, తహసీల్దార్‌ తఫాజుల్‌ హుస్సేన్‌, ఎంపీడీఓ భారతి, నాయకులు పాల్గొన్నారు.

ఫ వివిధ కారణాలతో మృతి చెందిన టీఆర్‌ఎస్‌  కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ అన్నారు. వీర్నపల్లి మండలంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బొప్పాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బోడ జగన్‌, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గర్జనపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి కిషన్‌ కుటుంబాలను గురువారం పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, రాష్ట్ర నాయకుడుచిక్కాల రామారావు, జడ్పీటీసీ కళావతి, ఎంపీపీ భూల, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొండ రమేష్‌గౌడ్‌, సెస్‌ డైరెక్టర్‌ మల్లేశం, నాయకులు ఉన్నారు.

ఫ ఎల్లారెడ్డిపేట: సహకార సంఘాల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సింగిల్‌ విండో కార్యాలయం, కేడీసీసీ బ్యాంకును నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావుతో కలిసి  గురువారం పరిశీలించారు. రైతులకు అందిస్తున్న సేవలను ప్యాక్స్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డిని అడిగి తెలుసుకున్నారు.  అంతకుముందు ప్యాక్స్‌ కార్యాలయంలో వినోద్‌కుమార్‌ను పాలక వర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ఎంపీపీ రేణుక, ఏఎంసీ చైర్మన్‌ రమేశ్‌, ప్యాక్స్‌ వైస్‌ చైర్మన్‌ సత్తయ్య, బ్యాంకు మేనేజర్‌ సంపూర్ణ, ఎంపీటీసీలు అనసూయ, గీతాంజలి, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు జబ్బార్‌ ఉన్నారు. 



Updated Date - 2022-07-01T06:45:11+05:30 IST