మహాసముద్రం... ప్రచారం ఆరంభం

Jul 30 2021 @ 06:04AM

తొలిచిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అజయ్‌ భూపతి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మహా సముద్రం’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలు. చిత్రీకరణ పూర్తవడంతో సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్రబృందం షురూ చేసింది. తాజాగా  విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌లో శర్వా, సిద్ధార్థ్‌ గంభీరమైన లుక్స్‌లో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో అదితీరావ్‌ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.