దుబాయ్ గుడిలో మహాశివరాత్రి పూజలు రద్దు

ABN , First Publish Date - 2021-03-01T13:23:04+05:30 IST

కొవిడ్ మహమ్మారి ప్రబలుతుండటంతో దుబాయ్‌లోని దేవాలయంలో ఈ ఏడాది మహాశివరాత్రి పూజల్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. ఈ నెల 11న మహాశివరాత్రితో పాటు వారంతపు సెలవులు కూడా రావడంతో భారీ

దుబాయ్ గుడిలో మహాశివరాత్రి పూజలు రద్దు

కొవిడ్ కారణంగా ముందు జాగ్రత్త చర్యలు

దుబాయ్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): కొవిడ్ మహమ్మారి ప్రబలుతుండటంతో దుబాయ్‌లోని దేవాలయంలో ఈ ఏడాది మహాశివరాత్రి పూజల్ని రద్దు చేస్తున్నట్లు ఆలయ  నిర్వాహకులు ఆదివారం ప్రకటించారు. ఈ నెల 11న మహాశివరాత్రితో పాటు వారంతపు సెలవులు కూడా రావడంతో భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దుబాయ్‌లోని బర్‌దుబాయ్ అనే ప్రాంతంలో ఉన్న శివాలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. ఇది మొత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న ఏకైక హిందూ దేవాలయం కావడం గమనార్హం. శివరాత్రి నాడు పూజలు, అభిషేకాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రయత్నిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. కొవిడ్ కారణంగా దుబాయ్‌లో గత ఏడాది మసీదులు, చర్చిలతో పాటు శివాలయాన్ని కూడా మూసివేశారు. అనంతరం తెలచినా పూజలు, నైవేద్యం, కీర్తనలపై మాత్రం ఆంక్షలున్నాయి. సంధీ వ్యాపారస్థులకు చెందిన సింధీ గురుదర్బార్ మందిర నిర్వహణ ట్రస్టు ఈ ఆలయాన్ని నిర్వహిస్తోంది. 


Updated Date - 2021-03-01T13:23:04+05:30 IST