మహాభారతంలో విచిత్ర సంఘటన.. భీకర యుద్ధం చేసి అర్జునుడినే చంపేసిన ఆ వీరుడు ఎవరో తెలుసా..?

ABN , First Publish Date - 2021-10-16T21:58:38+05:30 IST

మహాభారంతంలో శ్రీకృష్ణార్జునులను నరనారాయణులు అంటారు. వారిని ఎదుర్కోవడం ఎవరి తరమూ కాదు. అలాగే విలువిద్యలో అర్జునుడిని మించిన వీరుడు లేడు. అలాంటి అర్జునుడితోనే భీకర యుద్ధం చేసి, చివరకు ఒకే ఒక్క భాణంతో సంహరిస్తాడు ఓ మహావీరుడు...

మహాభారతంలో విచిత్ర సంఘటన.. భీకర యుద్ధం చేసి అర్జునుడినే చంపేసిన ఆ వీరుడు ఎవరో తెలుసా..?

మహాభారంతంలో శ్రీకృష్ణార్జునులను నరనారాయణులు అంటారు. వారిని ఎదుర్కోవడం ఎవరి తరమూ కాదు. అలాగే విలువిద్యలో అర్జునుడిని మించిన వీరుడు లేడు. అలాంటి అర్జునుడితోనే భీకర యుద్ధం చేసి, చివరకు ఒకే ఒక్క బాణంతో సంహరిస్తాడు ఓ మహావీరుడు... కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ధర్మరాజు అశ్వమేధయాగం చేయాలని నిర్ణయిస్తాడు. ఈ యాగం చేయడం ద్వారా చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ధర్మ సూత్రం. దీంతో యుద్ధానంతరం ఆ పాప పరిహారార్థం నిమిత్తం.. వ్యాసమహర్షి ఆదేశానుసారం ధర్మరాజు, యాగం చేస్తాడు. యాగంలో భాగంగా అశ్వాన్ని వదిలినప్పుడు.. అది వివిధ రాజ్యాలలో సంచరిస్తుంది. దాన్ని ఎవరైనా అడ్డుకుంటే వారిని యుద్ధంలో ఓడించాలి. అప్పుడే ఆ రాజ్యం వీరి సొంతమవుతుంది.


కొన్నేళ్ల తర్వాత అర్జునుడు యాగాశ్వానికి సంరక్షకుడిగా ఉంటూ.. మణిపురి రాజ్యానికి చేరుకుంటాడు. మణిపురి నగరాధిపతి బభ్రువాహనుడు, వేగుల ద్వారా ఈ సంగతి తెలుసుకున్నాడు. ఈయన స్వయంగా అర్జునుడు, చిత్రాంగద కుమారుడే. తండ్రి అర్జునుడు తన నగరానికి వస్తున్నాడని తెలిసి ఆనందించాడు. తండ్రిని దూరంగా చూడగానే చేతులు జోడించాడు. దగ్గరగా వచ్చి తండ్రి పాదాల మీద పడ్డాడు. పుత్రుడు బభ్రువాహనుడు అలా చేయడం అర్జునుడికి నచ్చలేదు. బభ్రువాహనుడితో ‘‘నీలాంటి రాకుమారులు అశ్వాన్ని అడ్డుకుని బంధించాలే గానీ.. ఇలా పాదాల మీద పడి, నమస్కరించడం సిగ్గుచేటు. పిరికిపందల పని చేశావు. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది.’’ అని అంటాడు. అనంతరం నాగేంద్రుడి కుమార్తె ఉలూచి ప్రోత్సాహంతో బభ్రువాహనుడు.. అర్జునితో యుద్ధానికి సిద్ధమవుతాడు. వారి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో అర్జునుడి బాణాల దాటికి బభ్రువాహనుడు శరీరం రక్తమోడుతుంది.

నెత్తురోడుతున్న తన శరీరాన్ని చూసుకుని ఆవేశాన్ని అణచుకోలేక వజ్రం వంటి బాణాన్ని గురి చూసి అర్జునుని మీద ప్రయోగించాడు. ఆ తర్వాత... పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

Updated Date - 2021-10-16T21:58:38+05:30 IST