సోదరుని పెద్దకర్మకి హాజరైన మహేష్ బాబు

Published: Sat, 22 Jan 2022 16:57:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సోదరుని పెద్దకర్మకి హాజరైన మహేష్ బాబు

ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు అకాల మృతి.. ఘట్టమనేని కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మరీ ముఖ్యంగా మహేష్ బాబుకి కరోనా పాజిటివ్ కావడంతో.. అన్నయ్య చివరి చూపుకు కూడా ఆయన నోచుకోలేకపోయారు. ఇది ఆయననే కాదు.. ఆయన ఫ్యామిలీని, అభిమానులని ఎంతగానో కలచివేసింది. ప్రస్తుతం కరోనా నుండి కోలుకున్న మహేష్ బాబు.. శనివారం జరిగిన తన సోదరుడి పెద్దకర్మకి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అన్నయ్య చనిపోయిన రోజు రాలేకపోయానని బాధపడుతూ.. మహేష్ కన్నీటి పర్యంతం అయినట్లుగా తెలుస్తోంది. 


మొదటి నుండి అన్నయ్య రమేష్ బాబు అంటే మహేష్ బాబుకు ఎంతో ఇష్టం. ఈ విషయం ఆయన అనేక మార్లు ప్రస్తావించారు కూడా. రమేష్ బాబు చనిపోయిన రోజు మహేష్ బాబు ఎమోషనల్ అవుతూ చేసిన ట్వీట్ కూడా అన్నయ్య అంటే అతనికి ఎంత ప్రేమో తెలియజేసింది. అందులో ‘మరో జన్మంటూ ఉంటే మీరే ఎప్పటికీ నా అన్నయ్య... మిమ్మల్ని ఇప్పుడు, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను..’ అంటూ మహేష్ తెలిపారు. కాగా, శనివారం రమేష్ బాబు ఇంట్లో జరిగిన ఈ పెద్దకర్మ‌కు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరైనట్లుగా సమాచారం.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International