Mahesh Babu vs Vishwak sen: అమెరికాలో ఎవరి సినిమా ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే..!

Published: Mon, 16 May 2022 10:09:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Mahesh Babu vs Vishwak sen: అమెరికాలో ఎవరి సినిమా ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే..!

ఓవర్సీస్ సినిమా: అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు సినిమాల జోరు కొనసాగుతోంది. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సినిమాలు విడుదల అవుతుండగా.. ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో Americaలో తెలుగు సినిమాలు కోట్లు కొల్లగొడుతున్నాయి. 


Mahesh Babu vs Vishwak sen: అమెరికాలో ఎవరి సినిమా ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే..!

కేవలం వారం రోజుల వ్యవధిలోనే రిలీజైన విశ్వక్ సెన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మూవీ.. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ అమెరికాలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. మే 6న రిలీజైన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ అమెరికాలో రెండో వారాన్ని కూడా విజయవంతంగా ముగించుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 170,207 డాలర్ల గ్రాస్(సుమారు రూ.1.32కోట్లు) రాబట్టింది. అదే సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా విషయానికి వస్తే.. 1.9మిలియన్ల (దాదాపు రూ.14.75కోట్లు) పైగా గ్రాస్ రాబట్టి సక్సెస్‌ఫుల్‌‌గా దూసుకెళ్తోంది. 


Mahesh Babu vs Vishwak sen: అమెరికాలో ఎవరి సినిమా ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే..!


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.