రేపు జిల్లాకు మహేష్‌గౌడ్‌, మధుయాష్కీ రాక

ABN , First Publish Date - 2021-07-27T06:29:48+05:30 IST

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ప్రచార కమిటీ కన్వీనర్‌ మధుయాష్కీ గౌడ్‌ బుధవారం జిల్లాకు రానున్నారు.

రేపు జిల్లాకు మహేష్‌గౌడ్‌, మధుయాష్కీ రాక
మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మధుయాష్కీ గౌడ్‌

రాష్ట్ర నేతలకు ఘనస్వాగతం పలికేందుకు జిల్లా నేతల సన్నాహాలు
జిల్లా కాంగ్రెస్‌లో నూతన ఉత్తేజం..
పూర్వవైభవం ఖాయమంటున్న నేతలు
త్వరలో పార్టీలో ముఖ్యనేతల చేరికలు

నిజామాబాద్‌అర్బన్‌, జూలైౖ 26: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ప్రచార కమిటీ కన్వీనర్‌ మధుయాష్కీ గౌడ్‌ బుధవారం జిల్లాకు రానున్నారు. టీపీసీసీలో ఉ న్నత పదవులు పొందిన వారిరువురూ మొదటిసారి జిల్లాకు వస్తుండడంతో వారికి ఘన స్వాగతం పలికేందుకు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సమాయత్తం అవు తున్నారు. ఇందల్‌వాయి టోల్‌గేట్‌ నుంచి ర్యాలీ, జిల్లా కేంద్రంలోని లక్ష్మి కల్యాణమండపంలో నిర్వహించే బ హిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రే ణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక పార్టీకి పూర్వ వైభవం
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం కనబడుతోంది. పార్టీకి మ ళ్లీ పూర్వవైభవం రావడం ఖాయమంటూ పార్టీ శ్రేణు లు అభిప్రాయపడుతున్నారు. గతంలో పార్టీని వీడి ఇ తర పార్టీల్లో చేరిన నేతలు సైతం తిరిగి కాంగ్రెస్‌ పార్టీ లో చేరేందుకు సిద్ధమవుతుండడమే ఇందుకు నిదర్శన ం. ఉమ్మడి జిల్లాలో గతంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండేది. 2004 ఎన్నికలలో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని మొత్తం తొమ్మిది అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని గె లుచుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత క్రమంగా బలహీనపడింది. 2009లో జరిగిన ఎన్నికల్లో అంతర్గత వి భేదాలతో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానానికి పరిమితమయింది. తెలంగాణ ఇచ్చిన ఘన త కాంగ్రెస్‌ పార్టీదే అయిన స్వరాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా గెలుచుకోలేకపోయింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌ 2019లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా పోయి ంది. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం నియమించడం అదేవిధంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌, ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ మఽధుగౌడ్‌లను నియమించడంతో పార్టీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు పీ సీసీ అధ్యక్షుడి గా పనిచేసి.. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన డి.శ్రీ నివాస్‌ తర్వాత జిల్లా నేతలకు టీపీసీసీలో ఉన్నత పదవులు రావడం తో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రెండుసార్లు ఎంపీగా గెలిచి న మధుగౌడ్‌, ఢిల్లీ స్థాయిలో పార్టీలో బలమైన సం బంధాలు కలిగి ఉండి ఎన్‌ఎస్‌యూఐ నుంచి పార్టీలో ఉన్న మహేష్‌గౌడ్‌ జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
త్వరలో పార్టీలోకి భారీగా వలసలు
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం త ర్వాత కాంగ్రెస్‌ పార్టీ వీడిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీవైపు చూస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవం త్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీని వీడిన వారంతా తిరిగి పార్టీలోకి రావాలని ఘర్‌వాపసి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పడంతో పార్టీని వీడిన వార ంతా తిరిగి పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇ టీవల డి.శ్రీనివాస్‌ తనయుడు, మాజీ మేయర్‌ సంజ య్‌ రేవంత్‌రెడ్డిని కలిసి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించా రు. రెండుసార్లు పీసీససీ అధ్యక్షుడిగా పనిచేసిన డి.శ్రీనివాస్‌ సైతం త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జ రుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీని వీడి గ తంలో ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలం తా తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థా యి నేతలతోపాటు నియోజకవర్గ స్థా యిలో గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేసిన వివిధ కారణాలతో ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతల ంతా మళ్లి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత పార్టీలో దూకుడు వా తావరణం కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్తున్నారు. రాబోయే రెండేళ్లలో పార్టీని జిల్లాలో బలోపేతం చేసి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు పార్టీ నేతలంతా సమాయాత్తం అవుతున్నారు.
స్వాగత కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ప్రచార కమిటీ చైర్మన్‌లుగా నియమితులైన మహేష్‌కుమార్‌గౌడ్‌, మధుగౌ డ్‌లు బుధవారం మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాటుచేసిన స్వాగత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కాం గ్రెస్‌ కార్యాలయంలో నగర అధ్యక్షుడు కేశవేణు, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, అర్బన్‌ ఇన్‌చార్జి తాహెర్‌బిన్‌ హుందాన్‌లతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ని ర్వహించారు. ఈనెల 28న ఇరువురు నేతలు బాధ్యత లు స్వీకరించి మొదటిసారి వస్తున్నందున వారికి ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు తరలిరావాలన్నారు.

Updated Date - 2021-07-27T06:29:48+05:30 IST