మహేశ్‌ మేనల్లుడు... అశోక్‌ గల్లా ‘హీరో’

Jun 24 2021 @ 01:24AM

కృష్ణ ఘట్టమనేని మనవడు, గుంటూరు ఎంపి జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రానికి ‘హీరో’ టైటిల్‌ ఖరారు చేశారు. మేనల్లుడి తొలి సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ టీజర్‌ను విడుదల చేసిన మహేశ్‌బాబు... శుభాకాంక్షలు తెలిపారు. అందులో కౌబాయ్‌గా, జోకర్‌గా ఈతరం యువతకు ప్రతినిధిగా అశోక్‌ గల్లా కనిపించారు. అలాగే, యాక్షన్‌ సన్నివేశాలతో పాటు రొమాన్స్‌కు సినిమాలో లోటు లేదని టీజర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘జోకర్‌గా అశోక్‌ నటన అద్భుతంగా ఉందంటున్నారంతా! అలాగే, కౌబాయ్‌ లుక్కూ నచ్చిందని చెబుతున్నారు. కౌబాయ్‌ గెటప్‌లో చేసిన ట్రైన్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రానికి హైలైట్‌ అవుతుంది. హీరోయిన్‌ నిధీ అగర్వాల్‌తో హీరో సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య చాలా క్లాసీగా సినిమాను తెరకెక్కించారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. అమరరాజా మీడియా పతాకంపై పద్మావతి గల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, నరేశ్‌, సత్య, అర్చనా సౌందర్య కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, రిచర్డ్‌ ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: చంద్రశేఖర్‌ రావిపాటి, సంగీతం: జిబ్రాన్‌.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.