బహుమతులు అందజేస్తున్న లక్ష్మీరెడ్డి, మాధవి
వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
మురళీనగర్, మార్చి 5: సమాజంలో మహిళ స్థానం అత్యున్నతమైనదని, సామాజిక పురోగతిలో వారి పాత్ర అనన్య సామాన్యమని ఏయూ ప్రొఫెసర్ (రిటైర్డు) కనకమహాలక్ష్మి అన్నారు. అన్నిరంగాల్లో అతివల పాత్ర పెరిగిందని, అవకాశాలను అందిపుచ్చుకుని నేటి మహిళ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని కోరారు. మాధవధారలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వాకర్స్ మహిళా క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా మహిళల పాత్రను వివరించారు. కార్య క్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ 101 ప్రతినిధి లక్ష్మీరెడ్డిని క్లబ్ సభ్యులు సత్కరించారు. అనంతరం మహిళ దినోత్సవ పోటీల్లో విజేతలైన వారికి అతిథుల చేతులు మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి డి.శిరీష, క్లబ్ సభ్యులు ప్రమీల, కార్యవర్గ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.