రూ.26 లక్షలకు కుచ్చుటోపీ

ABN , First Publish Date - 2021-05-09T06:03:34+05:30 IST

మండలంలోని గోవిందువారిపల్లిలో ఏడు మహిళా సంఘాలకు రూ. 26 లక్షలకు కుచ్చుటోపీ పెట్టి, ఆనిమేటర్‌ పరారైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రూ.26 లక్షలకు కుచ్చుటోపీ

ఏడు మహిళా సంఘాలను 

మోసం చేసిన ఆనిమేటర్‌ 

అన్నీ తానై వ్యవహరించిన వైనం.. 

రుణం కోసం వెళితే బండారం బట్టబయలు

ఏపీఎంకు ఫిర్యాదు..

తనకల్లు, మే 8: మండలంలోని గోవిందువారిపల్లిలో ఏడు మహిళా సంఘాలకు రూ. 26 లక్షలకు కుచ్చుటోపీ పెట్టి, ఆనిమేటర్‌ పరారైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా సంఘం సభ్యులు తెలిపిన మేరకు... శ్రీసాయి, వెంకటేశ్వర, నాగల క్ష్మి, శ్రీలక్ష్మి, లక్ష్మీనరసింహ, దుర్గా, విష్ణు మ హిళా సంఘాలు నల్లగుట్లపల్లి ఆంధ్రప్రగతి గ్రా మీణ బ్యాంక్‌లో ఒక్కో సంఘం రూ.5 లక్షలు బ్యాంక్‌ రుణం పొందింది. వాయిదా పద్ధతిలో ప్రతి నెలా బ్యాంకుకు వెళ్లి కొంత అప్పు తీర్చేవారు. కరోనా నేపథ్యంలో  మీ గ్రా మంలోనే ఉన్న బ్యాంక్‌ కరస్పాండెంట్‌ జయలక్ష్మి దగ్గర నగదు జమచేయాలని బ్యాంక్‌ అధికారులు సూచించారు. బ్యాంక్‌ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్న జయలక్ష్మి తమ గ్రూపులకు ఆనిమేటర్‌ కూడా కావడంతో మహిళా సంఘం సభ్యులు ప్రతినెలా బ్యాంక్‌కు చె ల్లించాల్సిన అప్పును జయలక్ష్మికి అందజేశా రు. ఆమె ఆ డబ్బును బ్యాంక్‌లో జయచేయకుండా నొక్కేశారు. వైఎ్‌సఆర్‌ క్రాంతిపథం (చౌడేశ్వరి మండలి సమాఖ్య నుండి) మ హిళా సంఘాలు తీసుకున్న స్త్రీనిధి, ఎస్సీ సబ్‌ప్లాన, ఐడబ్ల్యుఎంపీ, జెండర్‌, హ్యూమనడెవల్‌పమెంట్‌ రుణాలకు సంబంధించి ప్రతి నెలా మహిళలు చెల్లించిన డబ్బును ఎవరికీ అనుమానం రాకుండా జమ చేస్తూ  వచ్చా రు. దీంతో మహిళా సంఘాలు పర్యవేక్షణ చేస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ కానీ, ఏ పీఎం కానీ ఈ మహిళా సంఘాల విషయంలో పట్టిం చుకోలేదు. బ్యాంక్‌ల నుండి రావాల్సిన (ఓడీ) లిస్ట్‌ కూడా సీసీలకు కానీ, ఏపీఎంకు కానీ అందలేదు. ఈ కారణంగా ఎవరికి అనుమానం రాకుండా జయలక్ష్మి జా గ్రత్త పడింది. మహిళా సంఘం సభ్యులు కంతులు సక్రమంగా చెల్లించకపోవడంతో బ్యాంక్‌ అధికారులు మహిళా సంఘాల పొదుపు ఖాతా నుంచి డబ్బు డ్రా చేసి అప్పు ఖాతాలకు జమచేశారు. ఈ కారణంగా (ఓడీ) లిస్ట్‌ ఏపీఎం కు కానీ, సీసీకి కానీ వెళ్లలేదు. తమ అప్పు మొత్తం తీరి పోయిందని లెక్కలు వేసుకున్న మహిళా సంఘం సభ్యు లు తిరిగి అప్పు పొందాలని మహిళా సం ఘాలతో పని చేస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ బషీర్‌తో కలసి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌కు వెళ్లారు. బ్యాంక్‌లో అధికారులు పా త అప్పులు చెల్లించకుండా కొత్త అప్పులు ఎలా ఇస్తార ని ప్రశ్నించారు. దీంతో అవాక్కయిన మహిళా సంఘాలు మీరు చెప్పిన విధంగానే ప్రతి నెలా ఆనిమేటర్‌, బ్యాంక్‌ కరస్పాండెంట్‌ అయిన జయలక్ష్మికి డబ్బులు చెల్లించామని తెలిపారు. బ్యాంక్‌లో పైకం జమకాలేదని బ్యాంక్‌ అధికా రులు వెల్లడించారు. దీంతో మహిళా సంఘం సభ్యులు ఏ పీఎం వెంకటనారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఏపీఎం వెంకటనారాయణ శనివారం గ్రామానికి వెళ్లి గ్రామంలో మహి ళా సంఘం సభ్యులతో కలసి జరిగిన విషయాన్ని ఆరా తీయగా, రూ.26 లక్షలు మో సం జరిగినట్లు గుర్తించారు. ఇంకా విచారణ చేయాల్సి ఉందనీ, మరింత మోసం బయట పడవచ్చన్నారు. బ్యాంక్‌ కరస్పాండెంట్‌, ఆనిమేటర్‌ అయిన జయలక్ష్మిని ఫోనలో సంప్రదించడానికి ప్రయత్నించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో జరిగిన మోసాన్ని గుర్తించి ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏపీఎం వెంకటనారాయణ తెలిపారు. అవసరమైతే మహిళా సం ఘాల లీడర్లతో సంప్రదించి, తనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.


Updated Date - 2021-05-09T06:03:34+05:30 IST