అన్ని రంగాలలో మహిళలు రాణించాలి

ABN , First Publish Date - 2021-03-09T07:34:10+05:30 IST

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని 6వ అదనపు జిల్లా జడ్జి డా.ఎస్‌.రజిని అన్నారు.

అన్ని రంగాలలో మహిళలు రాణించాలి
మాట్లాడుతున్న జిల్లా జడ్జి రజిని



6వ అదనపు జిల్లా జడ్జి రజిని

ఘనంగా మహిళా దినోత్సవాలు

మార్కాపురం (వన్‌టౌన్‌) మార్చి 8: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని 6వ అదనపు జిల్లా జడ్జి డా.ఎస్‌.రజిని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసిందని ప్రతి మహిళా వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అనేక మంది చదివి ఉన్నత స్థానాలకు వచ్చారన్నారు. మహిళా సవాళ్లతో కూడిన సమాజంలో ఉందని సవాళ్లను స్వీకరించి ఎదుర్కోవాలన్నారు. సమాజాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దడంలో మహిళ పాత్ర ఎనలేదన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని శర్వాణి, యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు ఆర్‌.ఎం.ఝాన్సీపాల్‌, ప్రధానోపాఽధ్యాయులు ఎం.చంద్రశేఖర్‌ రెడ్డి, టి.ఎన్‌.జగన్నాథ్‌, యూటీఎఫ్‌ నాయకులు శ్రీరాములు, దండా వెంకటరెడ్డి, వీరకుమార్‌, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్‌జీవో హోంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఎన్‌జీవో నాయకులు బాలవిజయకుమారి, శ్రీనివాసశాస్త్రీ, నాగేంద్రరెడ్డి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఇందిరా ఇంజనీరింగ్‌ కళాశాలలో వీహెచ్‌ఆర్‌ విద్యా సంస్థల అధినేత వెన్నా ఇందిర ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు.  కార్యక్రమంలో ప్రధానాచార్యులు గోపాలకృష్ణ, జ్యోతిబసు, రాంకోటేశ్వరరావు పాల్గొన్నారు. స్థానిక బాలాజీ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో చైర్మన్‌ పత్తి రవిచంద్ర ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. 


Updated Date - 2021-03-09T07:34:10+05:30 IST