పెళ్లి గురించి ట్వీట్.. నవ్వలేక చచ్చానన్న మహీంద్రా!

ABN , First Publish Date - 2020-11-17T20:24:19+05:30 IST

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.

పెళ్లి గురించి ట్వీట్.. నవ్వలేక చచ్చానన్న మహీంద్రా!

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా. ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇలాంటి ట్వీట్లు చేయడం ఆనంద్ మహీంద్రాకు కొత్తేమీ కాదుకానీ.. ఈ జోక్ మాత్రం ఆ రేంజ్‌లో ఉంది. పెళ్లి గురించి ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నే ఈ జోక్. దీనికి సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన మహీంద్రా.. ఆ జోక్ చదివిన రోజు తాను విపరీతంగా నవ్వానని, నవ్వీ నవ్వీ తనకు డొక్కల్లో విపరీతంగా నొప్పి కూడా వచ్చిందని చెప్పారు. ఇంతకీ ఆ జోకేంటంటే..

ఓ రోజు ఆనంద్ మహీంద్రాకు ఎందుకో చీమల గురించి చెప్పాలనిపించింది. అప్పుడే ఓ ఆకుపై ఉన్న చీమ ఫొటో షేర్ చేశారు. దానిపై ‘‘ఓ ఒంటరి చీమ 29 ఏళ్ల వరకూ జీవించగలదు’’ అని రాసుంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. దీనిలో జోకేమీ లేదు. కానీ దీన్ని అమోల్ భారతే అనే వ్యక్తి జోక్ చేసి పారేశాడు. మహీంద్రా ట్వీట్‌లో ‘ఎ సింగిల్ యాంట్ కెన్ లివ్ టూ బి 29 ఇయర్స్ ఓల్డ్’ అని ఉంది. దాన్నే అమోల్ పట్టుకున్నాడు. ‘మరి పెళ్లయిన చీమ అయితే?’ అని ప్రశ్నించాడు.



సింగిల్ యాంట్ 29 ఏళ్లు జీవిస్తే? పెళ్లయిన దాని సంగతేంటని అమోల్ ప్రశ్నించాడు. ఆ ప్రశ్న చూసిన తాను కడుపులో నొప్పి వచ్చేలా నవ్వానని మహీంద్రా వెల్లడించారు. ‘‘అమోల్ భారతే ఈ సమస్య గురించి ప్రశ్నించినప్పుడు నేను నవ్వలేక చచ్చా. ఆ రోజు నవ్వుతుంటే డొక్కల్లో విపరీతంగా నొప్పి కూడా వచ్చింది. అంతలా నవ్వా. ఆ నొప్పి ఇంకా తగ్గలేదు. పెళ్లిలో కష్టాల గురించి నాకు తెలిసిన అద్భుతమైన జోక్స్‌లో ఇదీ ఒకటి’’ అని మహీంద్రా గుర్తుచేసుకున్నారు. దీన్ని చూసిన నెటిజన్లు కూడా పగలబడి నవ్వుతున్నారు.

Updated Date - 2020-11-17T20:24:19+05:30 IST