బోనస్ అంశం పరిశీలనలో మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్

ABN , First Publish Date - 2021-07-24T00:27:22+05:30 IST

రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ షేర్లు శుక్రవారం భారీగా పెరిగాయి.

బోనస్ అంశం పరిశీలనలో మహీంద్రా లైఫ్ స్పేస్ డెవలపర్స్

హైదరాబాద్ : రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ షేర్లు శుక్రవారం భారీగా పెరిగాయి. కాగా... ఈ(జులై) నెల 28 న జరగబోయే సమావేశంలో... తొలి బోనస్ సమస్యను బోర్డు పరిశీలించనుంది. ఈ నేపధ్యంలో... శుక్రవారం బీఎస్‌ఈపై ఇంట్రా డే ట్రేడ్‌లో మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ షేర్లు 19 శాతం పెరిగి రూ. 793.10 కి చేరుకున్నాయి. మరోవైపు...  మహీంద్రా గ్రూప్ షేర్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి. కాగా... ఇప్పటివరకు 6.22 లక్షల ఈక్విటీ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ కౌంటర్లలో చేతులు మారాయి. 


కాగా... కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం 2021 జూలై 28 బుధవారం జరగాల్సి ఉందని, జూన్ 30 వ తేదీతో ముగిసిన మొదటి త్రైమాసికంలో ఇంటర్-అలియా, ఆడిట్ చేయని స్టాండ్‌ఎలోన్, కన్సాలిడేటెడ్ ఆర్థిక ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలని కంపెనీ తెలిపింది. జూలై 28, బుధవారం జరగాల్సిన సమావేశంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు బోనస్ ఈక్విటీ షేర్ల జారీ ప్రతిపాదనను కూడా పరిశీలించనుందని జూలై 22, గురువారం మార్కెట్ అవర్స్ తర్వాత కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది.  

Updated Date - 2021-07-24T00:27:22+05:30 IST