ఈ ఉదంతంపై మహోబా జిల్లా అధికారి సత్యేంద్ర కుమార్ మాట్లాడుతూ బోరు బావిలో నుంచి బాలుని ఏడుపు వినిపిస్తున్నదన్నారు. ఆ బాలుడు 25 నుంచి 30 అడుగుల లోతున ఉన్నాడని తెలుస్తున్నదన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయని తెలిపారు. బాలుడిని కాపాడేందుకు ఆ బోరుబావికి సమాంతరంగా సొరంగం తవ్వుతున్నామని తెలిపారు. ఈ పనుల కోసం మూడు జేసీబీ యంత్రాలను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.