MP Mahua Moitra:మహిళ ఎంపీ చీరతోనే ఫుట్‌బాల్ ఆడిన వైనం...సోషల్ మీడియాలో వైరల్

ABN , First Publish Date - 2022-08-18T13:48:46+05:30 IST

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రా(Mahua Moitra) చీర కట్టుకొని ఫుట్‌బాల్ ఆడిన చిత్రాలు(football holding her SAREE) సోషల్ మీడియాలో వైరల్ ...

MP Mahua Moitra:మహిళ ఎంపీ చీరతోనే ఫుట్‌బాల్ ఆడిన వైనం...సోషల్ మీడియాలో వైరల్

కోల్‌కతా(పశ్చిమబెంగాల్): తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రా(Mahua Moitra) చీర కట్టుకొని ఫుట్‌బాల్ ఆడిన చిత్రాలు(football holding her SAREE) సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక చేత్తో చీర పట్టుకొని కాలితో ఫుట్‌బాల్(football) ఆడుతున్న చిత్రాలను తృణమూల్ ఎంపీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.(Trinamool MP herself shared the picture) ఎంపీ తన ఫోటో క్యాప్షన్‌లో ‘‘ఖేలా హోబ్ డిబాస్ కోసం కికింగ్ ఇట్ ఆఫ్’’(Kicking it off for Khela Hobe Dibas) అని రాశారు.


ఆగస్టు 16వతేదీన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ‘ఖేలా హోబే దివస్’ పాటించాలని సీఎం మమతా బెనర్జీ (Bengal Chief Minister and Trinamool Congress supremo Mamata Banerjee)ప్రకటించి, ఈ కార్యక్రమంలో యువత అధికంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహువా మొయిత్రా చీర కట్టుకొని, పాదాలకు స్నీకర్స్, కళ్లకు సన్ గ్లాసెస్ ధరించి ఒక చేత్తో చీర పట్టుకొని ఫుట్‌బాల్ ఆడి యువతలో హుషారు నింపారు.ఖేలా హోబే దివస్ సందర్భంగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహం కోసం ఫుట్‌బాల్ (football)మ్యాచ్‌లు నిర్వహించారు.




Updated Date - 2022-08-18T13:48:46+05:30 IST