ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా పొడవైన రైల్వే సొరంగం పూర్తి

ABN , First Publish Date - 2022-02-16T18:21:13+05:30 IST

ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్‌లోని కత్రా-బనిహాల్ సెక్షన్‌లోని సుంబెర్- అర్పించాల రైల్వేస్టేషన్ మధ్య అతి పొడవైన సొరంగాన్ని పూర్తి చేసినట్లు ఉత్తర రైల్వే తాజాగా ప్రకటించింది....

ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా పొడవైన రైల్వే సొరంగం పూర్తి

శ్రీనగర్: ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్‌లోని కత్రా-బనిహాల్ సెక్షన్‌లోని సుంబెర్- అర్పించాల రైల్వేస్టేషన్ మధ్య అతి పొడవైన సొరంగాన్ని పూర్తి చేసినట్లు ఉత్తర రైల్వే తాజాగా ప్రకటించింది.కత్రా-బనిహాల్ సెక్షన్‌లో 12.758 కిలోమీటర్ల పొడవు గల ఈ సొరంగం భారతీయ రైల్వేలలోనే అతిపెద్దదని రైల్వే అధికారులు చెప్పారు.పంజాబ్ రాష్ట్రంలోని బనిహాల్-ఖాజిగుండ్ సెక్షన్‌లో 11.2 కిలోమీటర్ల పొడవు గల సొరంగం దేశంలో నే పొడవులో రెండవదిగా రైల్వే అధికారులు పేర్కొన్నారు.ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ యొక్క 272 కి.మీ పొడవులో, 161 కి.మీ ఇప్పటికే ప్రారంభించారు. కత్రా బనిహాల్ మధ్య 111 కి.మీ మేర పనులు శరవేగంగా సాగుతున్నాయని రైల్వే తెలిపింది.


కత్రా-బనిహాల్ సెక్షన్ దిగువ హిమాలయాల కొండ భూభాగం గుండా రైలు ప్రయాణిస్తోంది.ఈ మార్గంలో ప్రధాన వంతెనలు, చాలా పొడవైన సొరంగాలు ఉన్నాయని, ఇవన్నీ వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని రైల్వే అధికారులు చెప్పారు.అనుభవజ్ఞులైన ఇంజనీర్ల బృందం అన్ని సవాళ్లను అధిగమించి రైలు సొరంగాన్ని నిర్మించారని రైల్వే అధికారులు వివరించారు. 

 

Updated Date - 2022-02-16T18:21:13+05:30 IST