నాణ్యమైన పనులు నిర్వహించాలి

Published: Thu, 19 May 2022 00:15:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నాణ్యమైన పనులు నిర్వహించాలి ఉపాధి పనులు పరిశీలిస్తున్న పీడీ యధుభూషణ్‌రెడ్డి

 ఉపాధి హామీ పీడీ 

దువ్వూరు, మే 18: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని జల సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ యధుభూషణ్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం చల్లబసాయిపల్లె గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేజ్‌పార్కు, సచివాలయం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం, పండ్ల తోటల పెంపకం, సీసీ రోడ్డును పరిశీలించారు. కూలీలకు సరైన వేతనం పడేలా ఉపాధి సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో రామచంద్రారెడ్డి, ఈసీ విజయకుమార్‌, పీఏలు, ఎఫ్‌ఏలు, గ్రామ మాజీ సర్పంచ్‌ సంగన లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.